Jabardasth Anchors: జబర్దస్త్ కార్యక్రమం ఎంతో మందికి లైఫ్ ఇచ్చిందని చెప్పాలి ఈ కార్యక్రమంలో ద్వారా ఎంతో మంది సెలెబ్రెటీలగా గుర్తింపు పొంది ఇండస్ట్రీలో బిజీగా ఉన్నారు. ఇకపోతే తాజాగా జబర్దస్త్ యాంకర్లుగా కొనసాగుతున్నటువంటి రష్మీ గౌతమ్ సౌమ్యరావు మధ్య పెద్ద ఎత్తున వివాదాలు తలెత్తునట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే అందరి ముందు వేదికపై వీరి మధ్య ఉన్నటువంటి విభేదాలు బయటపడ్డాయి.
ఇలా జబర్దస్త్ యాంకర్స్ మధ్య విభేదాలు రావడానికి గల కారణం ఏంటి అసలు ఏం జరిగింది అనే విషయానికి వస్తే…ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాలకు యాంకర్ గా కొనసాగుతున్నటువంటి రష్మీ కొత్త యాంకర్ సౌమ్యరావు రావడంతో జబర్దస్త్ కార్యక్రమం నుంచి తప్పుకున్నారు. దీంతో వీరిద్దరి మధ్య మనస్పర్ధలు ఉన్నాయని కూడా వార్తలు వచ్చాయి.
తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమం 100వ ఎపిసోడ్ కార్యక్రమంలో భాగంగా జబర్దస్త్ యాంకర్ సౌమ్య రావు సందడి చేశారు.నువ్వు రాగానే వెళ్ళిపోవడానికి నేనేమైనా పాత ముగ్గురు యాంకర్లు మాదిరి అనుకున్నావా అంటూ రష్మీ మాట్లాడింది. రష్మీ ఇలా మాట్లాడటంతో సౌమ్య రావు కూడా తనదైన శైలిలో పంచ్ వేసింది. పాత యాంకర్లు ముగ్గురు కాదు నలుగురు అంటూ సౌమ్య రావు రష్మికి కౌంటర్ ఇచ్చింది.
ఇక వీరిద్దరు వేదికపైనే నువ్వు గొప్ప నేను గొప్ప అంటూ పోటీ పడుతూ గొడవకు దిగడంతో మధ్యలో ఇంద్రజ కల్పించుకొని మీ ఇద్దరు ఎవరు బాగా పెర్ఫార్మెన్స్ చేస్తే వాళ్ళు జబర్దస్త్ యాంకర్ గా పేరు సంపాదించుకుంటారు అని చెప్పడంతో వీరిద్దరూ ఇంద్రజను మెప్పించడం కోసం పెద్ద ఎత్తున డాన్సులు చేస్తూ ప్రేక్షకులను సందడి చేశారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఈ ప్రోమో వైరల్ అవుతుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…