Balagam Fame Komuramma : బలగం సినిమా చిన్న సినిమాగా విడుదల అయి పెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఆ సినిమా కోసం పనిచేసిన ఎంతోమంది టెక్నీషియన్ తో పాటు ఆర్టిస్టులకు మంచి పేరు గుర్తింపు తెచ్చిపెట్టింది. సినిమా విడుదల అయి నెల పైనే కావొస్తున్నా ఇంకా సోషల్ మీడియాలో బలగం గురించిన ముచ్చట్లు ఆర్టిస్టుల ఇంటర్వ్యూలే ఉంటున్నాయి. ఇక బలగం సినిమాలో ముఖ్యంగా క్లైమాక్స్ సీన్ చాలా మందిని ఏడ్పించింది. చివర్లో మొగిలయ్య, కొమురమ్మలు పడే పాట అందరినీ కదిలించిందనే చెప్పాలి. అలాంటి మనసుకు హత్తుకునే పాటను పాడిన తెలంగాణ కళాకారులైన కొమురమ్మ, మొగిలయ్యలకు ఇపుడు తీరని కష్టం వచ్చింది. వాళ్ళను ఆకాశానికెత్తిన సోషల్ మీడియా వల్లే ఇబ్బందులను ఎదుర్కోంటున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తప్పుడు కథనాలు ప్రసారం చేయకండి…
మొగిలయ్య సినిమా ద్వారా ప్రపంచానికి తెలిసాడు. అయితే అంతకు ముందే ఆయన తెలంగాణ కళాకారుడు అయితే దురదృష్టవషాత్తూ ఆయనకు కిడ్నీ సమస్య కారణంగా ఖచ్చితంగా డయాలసిస్ చేయించుకోవాల్సిన పరిస్థితి. ఆయన ఆర్థిక స్థోమతకు అది తలకు మించిన భారం. అయితే బలగం సినిమా పుణ్యమా అని గుర్తింపు రావడం వల్ల కొంత ఆర్థిక సహాయం ప్రభుత్వం నుండి రాజకీయ ప్రముఖుల నుండి లభించింది.
అయితే సోషల్ మీడియాలో మాత్రం పవన్ కళ్యాణ్ 5 లక్షల సహాయం, నిర్మాత దిల్ రాజు 3 లక్షల సహాయం చేసాడు, మంత్రి రోజా 3 లక్షల సహాయం చేసింది, డబ్బు బాగానే వాళ్లకు అందుతోందని కట్టు కథలను సోషల్ మీడియాలో ప్రసారం చేస్తున్నారంటూ మొగిలయ్య భార్య కొమురమ్మ తెలిపారు. అలా చేయకండి అంటూ ఆవేదన వ్యక్తం చేసారు. కేవలం తెలంగాణ ప్రభుత్వం నుండి సహాయం అందుతోందని కొందరు మంత్రులు వచ్చి పరామర్శించి సహాయం చేసారని తెలిపారు. మొగిలయ్యకు ప్రస్తుతం కంటి చూపు కూడా పోవడంతో ఆయన కుటుంబం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…