Featured

Analyst Damu Balaji : బాలకృష్ణ గురించి మాట్లాడిన సుప్రియ… సినిమాలల్లో అందుకే చేయలేదంటూ కామెంట్స్…: అనలిస్ట్ దాము బాలాజీ

Analyst Damu Balaji : ఈ మధ్య టీవీనే కాకుండా ఓటిటి ప్లాట్ ఫార్మ్స్ లోనూ వివిధ సెలబ్రిటీ షోస్ ఎక్కువయ్యాయి. అన్నిటికంటే బాగా ఫేమస్ అయినది ఆహా ఒరిజినల్స్ లో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్. మెయిన్ గా ఈ షో బాలకృష్ణ వల్లే సక్సెస్ అయింది. ఈ షో కూడా ఇదివరకు వచ్చిన సెలబ్రిటీ టాక్ షోనే అయినా బాలకృష్ణ హోస్ట్ గా ఈ షో రన్ అవడమే మెయిన్ హైలైట్. ఇక టాలీవుడ్ యంగ్ హీరోల నుండి సీనియర్ హీరోల వరకు పలువురిని ఈ షోకి పిలిచి బాలయ్య మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు. ఇక ఇలాంటి షో ఆల్రెడీ టీవీలో అయితే ఆలీ తో సరదాగా అంటూ ఆలీ హోస్ట్ గా వస్తోంది కూడా. ఈ షో టీవీ షోలలో మంచి హిట్. ఇక మరోవైపు రాణా దగ్గుబాటి కూడా నెంబర్ వన్ యారీ అంటూ అటు ఇటు గా ఇలాంటి షోనే చేసాడు. ఇక సోనీ లైవ్ ఓటిటి లో కూడా నిజం విత్ స్మిత అంటూ పాప్ సింగర్ స్మిత హోస్ట్ గా ఒక షో రన్ అవుతోంది.

స్మిత షోలో సుప్రియ హాట్ కామెంట్స్…

ఈ షో గురించి దాము బాలాజీ మాట్లాడుతూ నిజం విత్ స్మిత షోకి పెద్దగా రేటింగ్స్ లేవని అన్నింటి కన్నా బెస్ట్ ఎపిసోడ్ అంటే చిరంజీవి గారి ఎపిసోడ్ అంటూ చెప్పారు. ఇక ఈ సీజన్ కి లాస్ట్ ఎపిసోడ్ గా ముగ్గురు పవర్ ఫుల్ మహిళలను ఈ షోలో ఆహ్వానించగా అందులో రాధిక, సుప్రియ, స్వప్న దత్ ఉన్నారంటూ తెలిపారు. అయితే సుప్రియ గారు బయట పెద్దగా ఇంటర్వ్యూ ఇవ్వరు కాబట్టి ఆమె షోలో హైలైట్. ఆమె అగ్ర హీరోలందరి గురించి మాట్లాడుతూ బాలకృష్ణ అంటే తనకు చాలా భయం ఆంటూ చెప్పారు. ఇక రొమాంటిక్ హీరో అంటే తాతయ్యే అని చెప్పిన సుప్రియ తనకు తాతయ్య, మావయ్య ను చూసి మేకప్ వేసుకుని సెట్స్ కి వెళ్లి పనిచేయాలని అనిపించేది. అలా వచ్చిన ఇంట్రస్ట్ తోనే ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమా లో చేశాను అంటూ తెలిపారు.

అయితే సినిమాలో నటించడం ఇష్టమే కానీ ఆ మేకప్ వాళ్ళు చెప్పిన బట్టలు వేసుకోవడం నావల్ల కాలేదు అందుకే మొదటి సినిమా ఇష్టం లేకుండానే ఫినిష్ చేశాను. ఇక అడ్వాన్స్ ఇప్పించుకున్నా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ చేయలేదు. అన్నపూర్ణ స్టూడియోస్ బాధ్యతలను తీసుకున్నాను అంటూ సుప్రియ పేర్కొన్నారు. ఇక తాను మళ్ళీ సినిమాల్లో నటించాలని ఇంట్రస్ట్ చూపుతోందని అందుకు అడవి శేష్ ప్రోత్సాహం కూడా కారణమని వందంతులు ఉన్నాయంటూ దాము బాలాజీ అభిప్రాయపడ్డారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago