Akhil: అఖిల్ తాజాగా ఏజెంట్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్న అఖిల్ ఎలాగైనా ఈ సినిమాతో సక్సెస్ అందుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఈ సినిమా ఈనెల 28వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా మీడియా సమావేశంలో అఖిల్ మాట్లాడుతూ ఈ సినిమా గురించి పలు విషయాలు తెలియజేశారు.ఈ సినిమా ప్రారంభం కాకముందే సురేందర్ రెడ్డి నాతో మాట్లాడుతూ నిన్ను చాలా కష్టపడతాను కష్టపడాలి అంటూ చెప్పారు. ఇప్పుడు అందరూ అఖిల్ ఎంతో మారిపోయారు అంటున్నారు అందుకు కారణం సురేందర్ రెడ్డి అంటూ తెలిపారు.
ఈ రెండేళ్ల ప్రయాణంలో తాను ఎన్నో విషయాలు నేర్చుకున్నానని, ఈ సినిమా కోసం ఎంతో కష్టపడుతూ అలసిపోయానని అయితే అందులో తనకు చాలా తృప్తి ఉందని అఖిల్ తెలిపారు. సాధారణంగా జిమ్ కి వెళితే ఎవరైనా శారీరకంగా మారుతారు కానీ ఏజెంట్ సినిమా నన్ను మానసికంగా మరింత దృఢం చేసిందని, ఈ సినిమా కోసం నా పరిది దాటి నటించాను అంటూ అఖిల్ తెలిపారు.
ఇలా ఈ ప్రయాణంలో తాను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను ముఖ్యంగా ముమ్మట్టి గారితో కలిసి నటించడం తనకు ఎంతో స్ఫూర్తిగా ఉందని తెలిపారు. ఏజెంట్ సినిమా తన జీవితాన్నే మార్చేసిందని ఈ సినిమా తనకు ఎప్పటికీ గుర్తుండి పోతుందని ఈ సందర్భంగా ఏజెంట్ సినిమా గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…