Featured

Balagam fame Lalitha chiranjeevi : బలగం సినిమాలో నన్ను ఎందుకు తీసుకున్నారంటే… డైరెక్టర్ వేణు గారి ముందు వెక్కి వెక్కి ఏడ్చాను…: బలగం ఫేమ్ లలిత చిరంజీవి

Balagam Fame Lalitha Chiranjeevi : తెలంగాణ పల్లె వాతావరణం, సంస్కృతిని సహజంగా చూపించి సక్సెస్ అయ్యాడు దర్శకుడు వేణు. ఒక మనిషి చనిపోయినపుడు ఇంట్లోని కుటుంబ సభ్యుల పరిస్థితి ఎలా ఉంటుంది ఎలా ఫీల్ అవుతారు లాంటి విషయాలను చాలా సునిశితంగా చూపించారు. బలగం సినిమా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అని కాకుండా దేశ విదేశాలలో చాలా మందికి నచ్చుతోంది. ఇక తెలంగాణ పల్లెల్లో అయితే గ్రామంలో అందరూ కలిసి సినిమా చూస్తూ ఎమోషనల్ అవుతున్నారు. అంతలా సినిమా అందరికీ కనెక్ట్ అయి ఆర్టిస్టులకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అలా సినిమాలో హీరో పిన్నిగా గయ్యాళి పాత్రలో నటించిన లలిత చిరంజీవి గారు ఆమె వ్యక్తిగత జీవితం అలానే తన కెరీర్ గురించి మాట్లాడారు.

అవకాశం ఎలా వచ్చింది… ఎలా సెలెక్ట్ అయ్యానంటే…

సురభి కళాకారిణిగా గుర్తింపు ఉన్న లలిత గారు ఈ సినిమా ఆడిషన్స్ జరుగుతున్న సమయంలో ఒక తెలిసిన వ్యక్తి ద్వారా సమాచారం తెలిసి ఆడిషన్స్ కి వెళ్లారట. అయితే అప్పటికే పలు సినిమా అడిషన్స్ కి వెళ్లిన ఆమె ఆడిషన్స్ ఇవ్వడం రావడమే తప్ప సెలెక్ట్ అయ్యేది లేదనే భావనతోనే బలగం ఆడిషన్ కి వెళ్లారట. అక్కడ సురభి కళాకారిణి అని చెప్పగానే ఒక ఎమోషనల్ సీన్ చెప్పి చేయమన్నారట.

డైలాగులు ఇచ్చి చదువుకోమని చెప్పగా వెంటనే చెప్తానని లలిత అనడంతో ఆశ్చర్యపోయారట టీం. ఇక ఆమె సీన్ చేసినపుడు గ్లిజరిన్ లేకుండా సహజంగా ఏడవడంతో అందరూ ఫిదా అయ్యారట. అదీకాక ఆమె సహజంగా నటించడం పాత్రలో లీనమవడం నచ్చిందట. దీంతో మళ్ళీ వర్క్ షాప్ కి రమ్మని చెప్పారట. అలా వర్క్ షాప్ లో తనకు తోడికోడలు క్యారెక్టర్ కు వచ్చిన వాళ్లతో సీన్స్ ప్రాక్టీస్ జరిగేది అయితే చివర్లో వచ్చిన రూప లక్ష్మి గారు వర్క్ షాప్ కి వచ్చి చేయడం సెలెక్ట్ అయిపోవడం జరిగింది. సోషల్ నాటకాలు ఎక్కువ వేయడం, పేజీలకు పేజీలు డైలాగులు చెప్పడం అలవాటు ఉండటం అలాగే సహజంగా ఏడుపు రావడం వంటివి ప్రాక్టిస్ ఉండటం వల్ల సులువుగా నటించగలనని తెలిపారు లలిత.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago