Categories: FeaturedMovie News

Balagam film director Venu : నన్ను చూసి నవ్వినోళ్ల నోర్లు మూయించా…: బలగం సినిమా డైరెక్టర్ వేణు

Balagam film director Venu : కమెడియన్ గా సినిమాల్లో ప్రయాణం మొదలు పెట్టి నేడు తెలుగు ప్రేక్షకుల మనసు హత్తుకునేలా సినిమా తీసిన డైరెక్టర్ వేణు. కమెడియన్ వేణు నుండి డైరెక్టర్ వేణు గారు వరకు తన ప్రయాణం, తాను పడిన కష్టాలు, ఇబ్బందులు, త్యాగాలు అన్నింటినీ ‘బలగం’ సినిమా సక్సెస్ అయ్యాక అందరి ప్రశంసలతో మర్చిపోతున్నానంటూ ఇంటర్వ్యూలలో చెప్పిన వేణు ఎల్దండి తన బలగం సినిమా ప్రయాణం గురించి ఇంటర్వ్యూలో తెలిపారు. సినిమా స్క్రిప్ట్ ను ఎలా తయారు చేసుకుంది, ఎన్ని రోజులు కష్టపడింది వంటి విషయాలను పంచుకున్నారు.

నన్ను చూసి నవ్వారు…

కమెడియన్ వీడు సినిమా డైరెక్టర్ ఏంటి అంటూ చాలా మంది నవ్వుకున్నారు. ఇది ఇపుడే కాదు నేను ‘రుద్రమదేవి’ సినిమాలో బన్నీగారికి సీన్స్ రాసినపుడు అలాగే ‘జై లవకుశ’ సినిమాలో యాక్షన్ సన్నివేశాలను రాసినపుడు కూడా ఎవరూ నమ్మలేదు. నేనే రాశానని తెలిసిన వాళ్ళు మరొకరికి చెప్పినా నమ్మలేదు. కమెడియన్ వేణు కాదులే ఇంకెవరో అయ్యుంటారు అని అన్నారు. అలాంటిది ఇప్పుడు బలగం సినిమా చూసాక ఆందరూ ప్రశంసిస్తుంటే చాలా ఆనందంగా ఉంది.

సినిమా టీం మొత్తం ఆ ప్రశంశలలో మునిగితేలుతున్నాం అంటూ తెలిపారు. సినిమా కథలో చాలా వరకు సన్నివేశాలను తన జీవితంలో జరిగినవే తీసుకున్నట్లు అందుకే అందరినీ ఆకట్టుకున్నాయని అందరూ కనెక్ట్ అవుతున్నారు అంటూ తెలిపారు. తన తండ్రి, పెదనాన్న పెద్దమ్మ మరణం అపుడు జరిగిన సంఘటనలు ఈ సినిమాలో ఉన్నాయని, ఇక మన చుట్టూ ఉన్నవాళ్ళ జీవితంలో కూడా మనం చూసే సంఘటనలను రాసుకున్నానని, ఇక సినిమాలో లోకల్ గా ఉన్న పల్లె వాళ్లను నటింపజేయడం వల్ల మరింత సినిమాకు కనెక్ట్ అయ్యారని తెలిపారు వేణు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago