Balakrishna : బాలకృష్ణ కుర్రహీరోలతో సమానంగా సినిమాలు చేస్తూ వస్తున్నారు. అఖండ సినిమా సక్సెస్ తో ఊపు మీద ఉన్న బాలయ్య తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 107వ సినిమా చేస్తున్నారు. ఇందులో బాలకృష్ణ సరసన తొలిసారిగా శృతి హాసన్ నటిస్తోంది. ఇక ఈ సినిమా తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కనుందని వినికిడి. మొదటిసారిగా ఈ సినిమాలో విలన్ గా కన్నడ హీరో దునియా విజయ్ నటిస్తున్నారు.
అనిల్ రావిపూడితో సినిమా పట్టాలెక్కనుంది….
ఇక ఈ సినిమా తరువాత బాలయ్య తన నెక్స్ట్ ప్రాజెక్ట్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయనున్నారు. ప్రస్తుతం f3 విడుదల పనుల్లో బిజీగా ఉన్న అనిల్ రావిపూడి ఈ సినిమా సక్సెస్ తరువాత బాలకృష్ణ సినిమా షూటింగ్ ని సెప్టెంబర్లో మొదలెట్టాలని అనుకుంటున్నారట. సక్సెస్ రేట్ తో దూసుకుపోతున్న అనిల్ తో బాలయ్య కాంబినేషన్ పై నందమూరి అభిమానుల అంచనాలు మాములుగా లేవు. ఇక ఈ సినిమాలో బాలకృష్ణకు కూతురిగా శ్రీలీలా నటిస్తోంది. ఇక హీరోయిన్ గురించే ఇపుడొచ్చిన తంటా.
హీరోయిన్ గా ప్రియమణి ఫ్యాన్స్ కి అనుమానాలు….
బాలకృష్ణ పక్కన హీరోయిన్ గా ఏ హీరోయిన్ అయినా చేయడానికి సిద్ధమే కానీ వచ్చిన చిక్కల్లా శ్రీ లీలా కు తల్లిగా నటించాల్సి రావడమే. ఈ కారణం చేత ఈ బాలయ్య హీరోయిన్ గా చేయడానికి హీరోయిన్లు సుముఖంగా లేరు. అయితే దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాలో బాలకృష్ణకు జోడిగా ప్రియమణిని హీరోయిన్ గా ఓకే చేశారట. ఇపుడు ఈ విషయంలో ఫ్యాన్స్ సంతృప్తిగా లేరనే టాక్ వినిపిస్తోంది. నటనపరంగా ప్రియమణి ఓకే కానీ తన సక్సెస్ రేట్ మాత్రం అంతగా లేదు. అది కాకా బాలకృష్ణ తో ప్రియమణి చేసిన మిత్రుడు సినిమా డిజాస్టర్ గా మిగిలింది. అందుకే అనిల్ రావిపూడి ఛాయిస్ పై అభిమానులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ అనిల్ రావిపూడి మాత్రం ప్రియమణి అయితేనే ఈ పాత్రకు బాగుంటుందని నమ్మకంగా ఉన్నారట.
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…
వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…
తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…
తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన ప్రయాణం చేసిన నటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, సంగీతంపై…
లోక్‌సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ధార్మిక అంశం చర్చకు దారితీసింది. జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఇటీవల శ్రీరాముడిపై చేసిన…