Varun Tej : మెగా కాంపౌండ్ నుండి హీరోగా అడుగుపెట్టిన వరుణ్ తేజ్ విభిన్న కథలను ఎంచుకుంటూ తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకున్నాడు. కంచెతో మొదలుపెట్టి నేటి f3 వరకు కథా ప్రాధాన్యమున్న సినిమాలను చేస్తూ కేవలం మెగా అభిమానులకే పరిమితమవకుండా, కామన్ ప్రేక్షకులను కూడా మెప్పిస్తున్నాడు. ఇక వరుణ్ తేజ్ కెరీర్ లో ఒక వైపు కాలేజీ లవ్ చూపిస్తూనే మరో వైపు ఫ్యామిలీ ఆడియన్స్ ని పలకరిస్తున్నాడు.
డబ్బు విలువ నాకు తెలుసు…..
ఇక గని సినిమాతో పరాజయం తెచ్చుకున్న వరుణ్, తాజాగా f3 సినిమాతో ముందుకు వస్తున్నాడు. నేడు విడుదల కాబోతున్న f3 సినిమా లో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్నారు. ఇక వీరికి జోడిగా తమన్నా, మెహరిన్ పిర్జాదా నటిస్తున్నారు. F2 సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాలో పోషకాహార లోపం వల్ల నత్తి ఉన్న యువకుడిగా వరుణ్ నటిస్తున్నాడు. ఇక సినిమా ప్రచారాల్లో భాగంగా పలు ఇంటర్వ్యూ ల్లో పాల్గొంటూ సినిమాకు సంబంధించిన విశేషాలను పంచుకుంటున్నారు.
ఇక డబ్బు చుట్టూ సాగే కథనంగా ఆద్యంతం నవ్వులతో సాగే చిత్రంగా f3 సినిమా వస్తోంది. ఇక డబ్బు గురించి ప్రశ్న వరుణ్ కి రాగా తాను డబ్బు విషయంలో చాలా జాగ్రత్తపరుడిని అని చెప్పాడు. సులువుగా డబ్బు సంపాదించే మార్గాలు ఉన్నా అలా డబ్బు సులువుగా వచ్చిన డబ్బు అంతే త్వరగా వెళ్ళిపోతుందని చెప్పాడు. డబ్బు ఉంది కదా అని విచ్చలవిడిగా ఖర్చు పెట్టరాదని హితవు పలికాడు. 10వ తరగతి చదువుకునే రోజుల్లో 50 రూపాయల పాకెట్ మనీతో బస్సు ఛార్జిలు, సినిమాలు చూడటానికి పొదుపుగా ఖర్చు చేసే వాడినని కొన్నిసార్లు స్నేహితులు తనకోసం డబ్బు ఖర్చు చేసేవారని, కొన్ని సార్లు నేను ఖర్చు పెట్టే వాడినని చెప్పాడు. డబ్బు విషయంలో చాలా అనుభవాలు ఉన్నాయని చెప్పి అందరికి షాకిచ్చాడు వరుణ్.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…