Featured

RRR Movie: ఆ సమయంలో ఎన్టీఆర్ ను తారక్ అని పిలిచింది ఎవరు..? అన్ని సంవత్సరాలు షూటింగ్ చేసి ఆమాత్రం చూసుకోవద్దా జక్కన్న?

RRR Movie: యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం RRR. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ఈ ఏడాది ఫిబ్రవరి 25వ తేదీ ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదలైంది. ఇలా పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్లను రాబట్టింది.

RRR Movie: ఆ సమయంలో ఎన్టీఆర్ ను తారక్ అని పిలిచింది ఎవరు.. ఆమాత్రం చూసుకోవద్దా జక్కన్న?

ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఏకంగా 1150 కోట్ల రూపాయలను సాధించినట్లు సమాచారం.థియేటర్ లో మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా మంచి కలెక్షన్లను రాబట్టిన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలో ప్రసారం అవుతూ మరోసారి ప్రేక్షకులను సందడి చేస్తోంది.

RRR Movie: ఆ సమయంలో ఎన్టీఆర్ ను తారక్ అని పిలిచింది ఎవరు.. ఆమాత్రం చూసుకోవద్దా జక్కన్న?

ఈ క్రమంలోనే ఈ సినిమాని ఓటీటీలో చూస్తున్న ప్రేక్షకులు ఇందులో ఉన్న తప్పులను కనిపెడుతూ సోషల్ మీడియా వేదికగా వాటిని షేర్ చేస్తూ పెద్ద ఎత్తున రాజమౌళి పై విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్, రామ్ చరణ్, ఒలివియో మధ్య జరిగే ఒక సన్నివేశంలో వెనక నుంచి ఎవరో ఎన్టీఆర్ ను తారక్ అని పిలవడాన్ని గుర్తించి ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ భారీగా రాజమౌళిపై ట్రోల్ చేస్తున్నారు.

ఎడిటింగ్ లోపం కావచ్చు..

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది నెటిజన్లు మూడు సంవత్సరాల నుంచి ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు ఈ మాత్రం చూసుకోవలసిన అవసరం లేదా జక్కన్నా అంటూ కొందరు కామెంట్లు చేయగా, మరి కొందరు బహుశా ఎడిటింగ్ లోపం అయి ఉంటుంది అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఇలాంటి చిన్నచిన్న తప్పులను ఎత్తిచూపుతూ నెటిజన్లు భారీగా ట్రోల్ చేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago