Pushpa: థియేటర్లో ఎక్కువ మంది చూసిన చిత్రంగా రికార్డు సృష్టించిన పుష్ప.. రెండో స్థానంలో ఆర్ఆర్ఆర్!
Pushpa: పుష్ప ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన రికార్డులను సృష్టించింది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయ్యి విశేషమైన ప్రేక్షకాదరణ పొందిందని చెప్పాలి.
ఈ సినిమాలో నటించిన నటీనటులకు కూడా పాన్ ఇండియా స్థాయిలో మంచి క్రేజ్ ఏర్పడింది.రికార్డుల పరంగా ఎన్నో సరికొత్త రికార్డులను సృష్టించిన పుష్ప తాజాగా మరో రికార్డును కైవసం చేసుకుంది.రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ ఏడాది విడుదలైన సినిమాలలో ఎక్కువ మంది ప్రజలు థియేటర్ కి వెళ్లి చూసిన సినిమాలలో పుష్ప సినిమా మొదటి స్థానంలో ఉంది.
ఈ విధంగా పుష్ప సినిమా మొదటి స్థానంలో ఉండగా రెండవ స్థానంలో త్రిబుల్ ఆర్, మూడవ స్థానంలో కేజిఎఫ్ చిత్రాలు నిలిచాయి.పుష్ప సినిమా ఇంత మంది ప్రేక్షకులు చూడటానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే కేవలం టిక్కెట్ల రేట్లు మాత్రమే అని చెప్పాలి.ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ 17 వ తేదీ విడుదలయినప్పటికీ మన రాష్ట్రంలో టికెట్ల రేట్లు చాలా తక్కువగా ఉన్నాయి.
ఈ క్రమంలోనే టికెట్ల రేట్లు పెంపు విషయం గురించి ఆలోచించకుండా నిర్మాతలు ఈ సినిమాని విడుదల చేశారు. ఇక టికెట్టు రేటు తక్కువగా ఉండడంతో అత్యధిక మంది జనాలు థియేటర్ కి వెళ్లి ఈ సినిమాని చూసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత విడుదలైన త్రిబుల్ ఆర్, కెజిఎఫ్ వంటి సినిమాలకు టిక్కెట్ల రేట్లు పెరగడంతో మంచి కలెక్షన్లను రాబట్టిన ప్రేక్షకులు థియేటర్ కి వెళ్లి సినిమాని వీక్షించలేదని తెలుస్తుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…