Featured

Dil Raju : మెహ్రీన్ కు గట్టి షాక్ ఇచ్చిన దిల్ రాజు… విజయ్ సినిమాలో మేహ్రీన్ లేనట్టే..

Dil Raju : తెలుగు చలన చిత్ర పరిశ్రమలోకి నాని హీరోగా వచ్చిన కృష్ణగాడి వీర ప్రేమ గాధ సినిమాతో అడుగుపెట్టింది పంజాబి భామ మెహ్రీన్. ఈ సినిమా విజయంతో మెహ్రీన్ కు అవకాశాలు బాగానే వ‌చ్చాయి. అందులోను మెహ్రీన్ హీరోయిన్ గా నటించిన చాలా సినిమాలు హిట్స్ కావ‌డంతో టాలీవుడ్ లో మెహ్రీన్ క్రేజ్ అమాంతం పెరిగింది. అయితే అనుకున్నట్టుగా మెహ్రీన్ కెరీర్ కొనసాగాలేదు. తన అందంతో పాటు అభినయంతో అభిమానులను సంపాదించుకున్నప్పటికి కెరీర్ పరంగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ సినిమాలను కొనసాగిస్తోంది.

ఎఫ్2 సినిమాలో హనీ ఇస్ ది బెస్ట్ అని అభిమానులను ఆకట్టుకున్న మెహ్రీన్ ఇపుడు తాజాగా దానికి సీక్వెల్ గా వస్తున్న ఎఫ్ 3 సినిమాతో కూడా అభిమానులను అలరించడానికి సిద్ధం అవుతోంది. అయితే ప్రస్తుతం ఎఫ్3 సినిమా ప్రమోషన్ లో బిజీగా వుంది మెహ్రీన్. తాజాగా మెహ్రీన్ గురించి ఒక రూమర్ చక్కర్లు కొడుతోంది. అదేంటంటే విజయ్ 66 సినిమా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వస్తుండటం అందులో రష్మిక హీరోయిన్ అని తెలిసిందే. కాకపోతే ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా మెహ్రీన్ నటిస్తోందని వార్తలు వినిపించాయి. తాజాగా మెహ్రీన్ నటించిన ఎఫ్3 నిర్మాత, విజయ్66 సినిమా నిర్మాత దిల్ రాజు కావడంతో ఇది నిజం అని అందరు అనుకుంటున్నారు.

మెహ్రీన్ -విజయ్ సినిమా గురించి దిల్ రాజు క్లారిటీ….

తాజాగా విజయ్66 సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గురించి చిత్ర బృందం క్లారిటీ ఇచ్చింది. విజయ్ 66 సినిమాలో ఒక్క హీరోయిన్ మాత్రమే ఉందని అది కూడా రష్మిక మాత్రమే హీరోయిన్ అని, సెకండ్ హీరోయిన్ పాత్రకి స్కోప్ లేదని సినిమాలో ఇంకా ఎవరిని ఎంపిక చేయలేదని నిర్మాత దిల్ రాజు టీమ్ క్లారిటీ ఇచ్చారు. కానీ ఈ పుకార్లు నిజం అయ్యి విజయ్66 లో మెహ్రీన్ కు ఛాన్స్ వచ్చి ఉంటే తెలుగు మరియు తమిళంలో బిజీ అయ్యేది అని అభిమానులు అనుకుంటున్నారు. ఇక నిశ్చితార్థం క్యాన్సిల్ అయిన త‌ర్వాత మెహ్రీన్ సోషల్ మీడియాలో గ్లామ‌ర్ షోతో ర‌చ్చ చేస్తున్న విషయం తెలిసిందే.

Bhargavi

Recent Posts

నేను నటిని.. సంఖ్యలతో కాదు ప్రతిభతో అవకాశాలు రావాలి: శివాత్మిక ఘాటు వ్యాఖ్యలు

తెలుగు సినీ పరిశ్రమలో కొత్త తరం నటీమణుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్న శివాత్మిక తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా…

2 hours ago

బ్యాంక్ లోన్ తెలిసింది.. ఐపీఎల్‌లో ప్లేయర్ లోన్ ఏంటి? ఆర్‌సీబీ స్టార్ చెన్నై దారి పట్టాడా!

ఐపీఎల్ 2026 సీజన్‌లో గాయాల సమస్యలు జట్లకు తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇది పెద్ద…

2 hours ago

మళ్లీ అతడితో పని చేయను.. ప్రగతి సంచలన వ్యాఖ్యలు

తెలుగు సినీ పరిశ్రమలో తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రగతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌లో…

2 hours ago

హీరోయిన్ అంటే ఆమెనే.. జయసుధ సంచలన వ్యాఖ్యలు

తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా తన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన జయసుధ, ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో…

2 hours ago

సినిమాల కంటే కుటుంబమే ముఖ్యం.. నాదియా షాకింగ్ రివీల్

తెలుగు ప్రేక్షకులకు తన అందమైన నటనతో, మృదువైన వ్యక్తిత్వంతో దగ్గరైన నటి నాదియా తాజాగా తన సినీ ప్రయాణం, వ్యక్తిగత…

2 hours ago

మ్యాచ్‌కు ముందు కార్టూన్లు.. మైదానంలో రికార్డులు! సూర్యవంశీ స్టైల్

ఐపీఎల్ 2026 సీజన్‌లో యువ ఆటగాళ్ల ప్రదర్శనలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ…

5 hours ago