Balakrishna: నందమూరి నట సింహం బాలకృష్ణ తాజాగా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని డాకు మహారాజ్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో చిత్ర బృందం సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే చిత్ర బృందం మొత్తం యాంకర్ సుమతో కలిసి ఒక ఇంటర్వ్యూ చేశారు.
ఈ ఇంటర్వ్యూ సందర్భంగా బాలకృష్ణ ఒక ఆసక్తి కరమైన విషయాన్ని బయట పెట్టారు. బాలకృష్ణ తన నిజ జీవితంలో కూడా ఎన్నో రకాల సెంటిమెంట్లను నమ్ముతారనే విషయం మనకు తెలిసిందే. కచ్చితంగా బాలయ్య ఈ సెంటిమెంట్లను ప్రతి సందర్భంలోనూ ఫాలో అవుతూ ఉంటారట. అలాంటి వాటిలో ఆదివారం కూడా ఒక సెంటిమెంట్ తప్పకుండా ఫాలో అవుతారని తెలుస్తుంది. ఆదివారం వచ్చిందంటే బాలకృష్ణ పొరపాటున కూడా నలుపు రంగు దుస్తులు వేసుకోను అంటూ ఈ సందర్భంగా బయటపెట్టారు.
ఇలా బాలకృష్ణ ఆదివారం నలుపు రంగు దుస్తులు వేసుకోకపోవటానికి కారణం ఏంటనే విషయాన్ని కూడా ఈయన బయటపెట్టారు. ఆదివారం ప్రత్యాతి దేవతలందరూ ఉంటారని తాను భావిస్తాను అందుకే ఆదివారం నలుపు రంగు వేసుకోను అలా నలుపు రంగు వేసుకుని వెళ్తే కనుక ఏదో ఒక ప్రమాదం జరుగుతుందని బాగా నమ్ముతాను అందుకే తాను ఆదివారం వచ్చిందంటే కచ్చితంగా ఈ సెంటిమెంట్ ఫాలో అవుతానని తెలిపారు.
నలుపు రంగు దుస్తులు…
ఇకపోతే ఆదిత్య 369 సినిమా షూటింగ్ సమయంలో ఆదివారం షూటింగ్ జరుగుతుంది తాను నలుపు రంగు వేసుకొని అని చెప్పినా దర్శకులు సూచనలు మేరకు ఆ రోజు నలుపు రంగు దుస్తులు వేసుకున్నాను అయితే ఈ సినిమా నిర్మాతలలో ఒకరైన ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు అదే రోజు సినిమా షూటింగ్ సెట్ కు వచ్చారు. ఆయన వస్తున్నారని తెలిసి నేను వెళ్ళగా తన కళ్ళముందే జారి కింద పడిపోయానని ఆ సమయంలో నా నడుము విరిగిందని తెలిపారు. అందుకే ఆదివారం తాను నలుపు రంగు దుస్తులు వేసుకోను ఒకవేళ వేసుకుంటే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి అంటూ ఈ సందర్భంగా బాలకృష్ణ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…