Balakrishna: నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం యువ హీరోలకు పోటీగా వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఒకవైపు రాజకీయాల పరంగా బిజీగా గడుపుతూనే మరోవైపు వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ ఎంతో మంచి సక్సెస్ అందుకుంటూ ఉన్నారు.
ఇక బాలయ్య వ్యక్తిత్వం గురించి ఇప్పటికే ఎంతోమంది ఎన్నో రకాలుగా చెబుతూ ఉంటారు అయితే బాలయ్య బయటకి ఎక్కడికైనా వస్తే అభిమానులపై చేయి చేసుకుంటారని విషయం మనకు తెలిసిందే. దీంతో బాలయ్య ఒక సైకో అని బయటకు వస్తే ఎలా వ్యవహరించాలో తెలియని సంస్కారహీనుడు అంటూ చాలామంది ఆయన గురించి తప్పుగా మాట్లాడుతుంటారు.
ఈ విధంగా బాలయ్య గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారికి ప్రముఖ సీనియర్ డైరెక్టర్ కోదండరామిరెడ్డి చెంప చెల్లుమనిపించే సమాధానం చెప్పారు. వీరిద్దరి కాంబినేషన్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా కోదండరామిరెడ్డి బాలకృష్ణ వ్యక్తిత్వం గురించి మాట్లాడుతూ .. బాలయ్య సెట్ లోకి అడుగుపెట్టారు అంటే చాలా సరదాగా ఉంటారు అక్కడ ఉన్న వారందరికీ ఈయన చేతులు జోడించి నమస్కారం చేస్తూ లోపలికి వస్తారు.
పేరుపేరునా పలకరిస్తారు..
ఇక మా అందరితో సరదాగా మాట్లాడుతూ కూర్చునే వారు. మేం భోజనం చేసేటప్పుడు మాతో కలిసి భోజనం చేసేవారు ఇప్పటికీ నేను ఎక్కడ కనిపించిన ఆయన నన్ను పలకరించడమే కాకుండా మా ఇంట్లో వారి ప్రతి ఒక్కరి పేరు పేరున అడిగి క్షేమమాచారాలు తెలుసుకుంటారని తెలిపారు. అలాకాకుండా బాలయ్య నేను ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకుని, స్టార్ హీరో కుమారుడిని గోల్డెన్ స్పూన్ తో పుట్టాను అనే గర్వం బాలయ్యలో ఏ మాత్రం లేదు అంటూ బాలకృష్ణ వ్యక్తిత్వం గురించి కోదండ రామి రెడ్డి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…