యాబై ఏళ్ల వయసులో ఇంకా వన్నె తగ్గని రవీనాటాండన్ ఇప్పుడు తన నటనతో భారతదేశం అంతటా ప్రశంసలు పొందుతున్నారు. ఈమే బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రవిటాండన్ కూతురుగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. అంతేకాదు హీరోయిన్‌గా ఒక తరాన్ని తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. తాజాాగా యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజీఎఫ్ చాప్టర్ 2లో ప్రధాన మంత్రి “రమికా సేన్” పాత్రలో హీరోను ఢీ కొట్టే పాత్రలో తన నటనతో ఆకట్టుకుంది.
కేజీఎఫ్ 2లో ప్రధానమంత్రి రమికా సేన్ పాత్రలో నార్త్ సౌత్ అంటూ తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను తన నటనతో అట్రాక్ట్ చేసింది. ఒకప్పటి బాలీవుడ్ బ్యూటీ రవీనా టాండన్. ఈ సినిమా ఇంకా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూనే ఉంది.
ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఓ రేంజ్‌లో టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా మొదటి రోజు బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టించింది… ఇకపోతే లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్పెక్టర్ లాంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత బాలకృష్ణ మరో చిత్రాన్ని ప్రారంభించాలనుకున్నారు. ఒకవైపు నిప్పురవ్వ షూటింగ్ ఆలస్యం కావడంతో ఆయన రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో మరో సినిమాలో నటించారు.
1993 జగపతి ఆర్ట్ పిక్చర్స్, రవిరాజాపినిశెట్టి దర్శకత్వంలో “బంగారుబుల్లోడు” చిత్రం విడుదల అయ్యింది. మొదటి హీరోయిన్ గా రమ్యకృష్ణ తీసుకున్నప్పటికీ రెండో హీరోయిన్ గా ముంబై తార కోసం దర్శక, నిర్మాతలు ప్రయత్నించారు. మొదటగా దివ్యభారతి హీరోయిన్ గా అనుకోగా అప్పటికే ఆమె బిజీ కావడంతో బాలకృష్ణ హీరోగా వచ్చిన “నిప్పురవ్వ” చిత్రంలో ఆమె నటించ లేకపోయారు. ఇక మళ్లీ దివ్య భారతిని సంప్రదించడానికి దర్శక, నిర్మాతలు ప్రయత్నించలేదు. ఆ క్రమంలో అప్పటికీ పలు విజయవంతమైన హిందీ చిత్రాల్లో హీరోయిన్ గా నటిస్తున్న రవీనా టాండన్ ని “బంగారు బుల్లోడు” చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా తీసుకున్నారు.
ఈచిత్రానికి ప్రముఖ సంగీత దర్శకులు రాజ్ కోటి విజయవంతమైన గీతాలను అందించారు.. “స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సంధ్య వాన.. సంధ్యలో చీకటంత సిగ్గుల అంటుకుంది లోన లోనా..” అనే ఈ వాన పాట అటు బాలకృష్ణ ఇటు రాజ్ కోటి సినీ కెరీర్ లో “ఆల్ టైం హిట్ సాంగ్” గా నిలిచిపోయింది. ఈ పాటలో బాలయ్య రవీనా టాండన్ వేసిన స్టెప్పులు ఆయన అభిమానులే కాకుండా ప్రేక్షకులను కూడా అలరించాయి. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా విజయ దుందుభి మోగించింది. ఆ తర్వాత రవీనాటాండన్ రథసారధి, ఆకాశవీధిలో, పాండవులు పాండవులు తుమ్మెద లాంటి చిత్రాల్లో వెండితెరపై కనిపించారు.
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్‌లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్‌తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…
హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…
తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…