Balasubhramanyam Reddy Suicide case : కొన్నిసార్లు బ్రతకడానికి మన ముందున్న సవాళ్ళను ఎదుర్కొనడానికి ధైర్యం సరిపోక బలవంతంగా చనిపోయే సాహసం చేస్తాం. కష్టాలు అందరికీ వస్తాయి, ఆ కొంత కాలం మనోనిబ్బరంతో ఉంటే గట్టెక్కుతాం కానీ కొంతమంది క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకుని తమ కుటుంబం గురించి ఆలోచించక తనువు చాలిస్తారు. వారినే నమ్ముకుని బ్రతుకుతున్న కుటుంబం రోడ్డున పడటం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు అలాంటి ఘటనే నెల్లూరు జిల్లా రూరల్ లో జరిగింది.
కూతుర్లే కొడుకులుగా మారి తలకొరివి…
నెల్లూరు జిల్లా విడవలూరు మండలం చౌకచర్ల గ్రామానికి చెందిన 46 ఏళ్ళ వయసు ఉన్న శంకుల బాలసుబ్రమణ్యం రెడ్డి చిన్నపాటి కాంట్రాక్టర్. పిల్లల చదువుల కోసం హైదరాబాద్ వెళ్లిన ఆయన అక్కడ్ ఒక ప్రైవేట్ కంపెనీ లో సబ్ కాంట్రాక్టర్ గా పనిచేస్తున్నాడు. నాగాలాండ్ లో కాంట్రాక్టు పని లభించడంతో 12 కోట్లు బయట అప్పు చేసి తెచ్చి నాగాలాండ్ వెళ్లి పనులను పూర్తి చేసారు బాలసుబ్రమణ్యం రెడ్డి. అయితే పనులు పూర్తి అయ్యాక బిల్లులు క్లెయిమ్ చేసుకోవాలని నాగాలాండ్ వెళితే సదరు సంస్థ కేవలం 4.03 కోట్లు మాత్రమే ఇచ్చారు మిగిలిన మొత్తాని ఇవ్వకపోవడంతో ఎన్ని సార్లు అడిగినా వాళ్ళు కాలయాపన చేయడంతో హైదరాబాద్ వస్తే అప్పుల వాళ్ళ ఒత్తిడి ఎక్కువ అవడంతో నాగాలాండ్ తిరిగి వెళ్లారు బాలసుబ్రమణ్యం రెడ్డి.
సమస్యనుండి ఎలా బయట పడాలో తెలియక ప్రధాన మంత్రి మోడీకి కంపెనీ చేసిన మోసంను సుసైడ్ లేఖలో వివరించి చర్యలు తీసుకోవాలని రాసి నాగాలాండ్ లో రూమ్ లోనే ఆత్మహత్య చేసుకుని మరణించారు. ఇక బాలసుబ్రమణ్యం రెడ్డి కి భార్య శారద, కూతుర్లు తేజ, లిఖిత ఉన్నారు. ఇక ఆయన మరణ వార్త ఆ కుటుంబాన్ని షాక్ కి గురిచేసింది. స్వస్థలం చౌకిచర్ల కు బాలసుబ్రమణ్యం రెడ్డి మృత దేహం తీసుకురాగా కొడుకులు లేకపోయినా కూతుర్లే కొడుకుల్లాగా మారి ఆయనకు అంత్యక్రియలు నిర్వహించారు. బంధువుల సహాయంతో అన్ని శాస్త్రోక్తంగా నిర్వహించిన దృశ్యాలు అక్కడ ఉన్న అందరినీ కలచివేశాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…