Ticket For One Rupee: సాధారణంగా ఒక వ్యక్తి సినిమా చూడాలి అంటే సాధారణ థియేటర్లలో టికెట్టుకు 200 పోను మిగతా ఖర్చులు కలిపి ఒక 500 వరకు వస్తాయి. అదే మల్టీప్లెక్స్ లో సినిమా చూడాలంటే కేవలం టికెట్ కోసం మాత్రమే 500 రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇలా 500 రూపాయలు పెట్టి సినిమా చూడటం సామాన్య ప్రేక్షకుడికి చాలా భారంగా మారుతుంది.
ఇలా ఏ విధమైనటువంటి భారం లేకుండా మల్టీప్లెక్స్ లో ఒక్క రూపాయికి సినిమా చూసే అవకాశాన్ని ప్రముఖ మల్టీప్లెక్స్ థియేటర్ కల్పించింది. అయితే ఇంత అద్భుతమైన అవకాశాన్ని ఎక్కడ కల్పించారు ఏంటి అనే విషయానికి వస్తే… ఈ అద్భుతమైన అవకాశం మరి ఎక్కడో కాదు మన హైదరాబాద్ లోనే ఈ అవకాశాన్ని కల్పించారు.
హైదరాబాద్ లోని మౌలాలిలో మూవీ మ్యాక్స్ AMR పేరుతో ఓ మల్టీప్లెక్స్ ను ఏర్పాటు చేశారు. ఈ మల్టీప్లెక్స్ నేడు ఎంతో ఘనంగా ప్రారంభం అయింది ఇలా కార్యక్రమంలో భాగంగా యాజమాన్యం కేవలం ఒక్క రూపాయికి మాత్రమే ప్రేక్షకులకు సినిమా చూసే అవకాశాన్ని ఈరోజు మాత్రమే కల్పించారు.
ఇలా ఒక్క రూపాయి టికెట్ తో ఈరోజు ఈ మల్టీప్లెక్స్ లో సినిమా చూసే అవకాశాన్ని పొందవచ్చు. ఇక ఈ మల్టీప్లెక్స్ లో ఏకంగా 11 సినిమాలను ప్రదర్శితం చేయనున్నట్లు యాజమాన్యం వెల్లడించారు. కుటుంబంతో కలిసి మల్టీప్లెక్స్ లో సినిమా చూడాలనుకునే వారికి ఇదొక అద్భుతమైన అవకాశం అని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మల్టీప్లెక్స్ యాజమాన్యం వెల్లడించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…