Bandla Ganesh : క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చిన్న చిన్న పాత్రలు వేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న బండ్ల గణేష్ ఆ తరువాత ప్రొడ్యూసర్ గా మారి సినిమాలను నిర్మించారు. ఎన్నో కాంట్రావెర్సీలకు కేర్ఆఫ్ గా నిలబడిన బండ్ల గణేష్ ఒకప్పుడు స్టార్ హీరోల్తో సినిమాలను తీసి వరుస హిట్లను చూసారు. ప్రస్తుతం సినిమా నిర్మాణంలో లేకపోయినా పాలిటిక్స్ గురించి అలానే సినిమా ఇండస్ట్రీ గురించి తనదైన శైలిలో మాట్లాడుతూ బాగా సోషల్ మీడియాలో నానే బండ్ల అన్న తన సినిమాల గురించి సినిమా నిర్మాణం గురించి ఆసక్తికర వాఖ్యలను చేసారు.
సినిమాలకు పనికిరానని అవమానించారు…
సినిమాల్లో నటించాలనే ఇండస్ట్రీకి వచ్చిన బండ్ల గణేష్ కు మొదట్లో అవమానాలు ఎదురయ్యాయట. ఒకప్పుడు విలన్ గా ఉండి మళ్ళీ హీరో అయిన ఒక ఆర్టిస్ట్ బండ్ల గణేష్ ను చాలా చిన్నచూపు చూసేవాడట. షాద్ నగర్ లో కోళ్ల ఫారమ్ చూసుకో నీకెందుకు సినిమాలు అంటూ మాట్లాడేవరని బండ్ల గుర్తుచేసుకున్నారు. నన్ను సినిమాలకు పనికిరావని అవమానించిన వారు ప్రస్తుతం లేరని మరణించారని అలాంటి వారి గురించి మాట్లాడుకోవడం సంస్కారం కాదంటూ పేరు చెప్పడానికి ఇష్టపడలేదు బండ్లన్న.
తనకు రామా నాయుడు స్టూడియోస్ లాగా బండ్ల గణేష్ స్టుడియో కట్టాలని ఉందంటూ అదే నా లక్ష్యం అని, నేను లేకపోయినా నా పేరు అందరూ చెప్పుకోవాలని నా కోరిక అంటూ తెలిపారు. నా పిల్లలు భవిష్యత్ లో ఆ స్టూడియో చూసుకుంటారు అందుకే ఒక పది ఎకరాల స్థలంలో స్టూడియో కట్టాలన్నది నా కోరిక అంటూ తెలిపారు.
ప్రసిద్ధ సినీ నటి తమన్నాభాటియా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి భక్తిశ్రద్ధలు చాటుకున్నారు. తిరుమల దేవాలయంలోఉదయం వేళలోనే ఆమె స్వామివారిని…
టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ అనన్య నాగళ్ల ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె…
తెలంగాణకు చెందిన ఓ భక్తుడు తన భక్తిశ్రద్ధలను ప్రత్యేకంగా చాటుకున్నారు. హైదరాబాద్కు చెందిన ఈ భక్తుడు, ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలం…
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ వైష్ణవక్షేత్రాలలో ఒకటైన సింహాచలం దేవాలయంలో జరగబోయే చందనోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రతి ఏడాది విశేషంగా నిర్వహించే…
తమిళ సినీ నటుడు, తమిళక వెట్రి కళగం (TVK) పార్టీ అధినేత విజయ్ తాజాగా రాజకీయ కార్యక్రమాల్లో భాగంగా ఆధ్యాత్మిక…
ఉత్తరాఖండ్‌లో ప్రతి ఏడాది భక్తుల ఆధ్యాత్మిక ఆశలను నెరవేర్చే చార్‌ధామ్ యాత్ర ఈసారి కూడా ఘనంగా ప్రారంభమైంది. అక్షయ తృతీయ…