Movie News

Sati Savitri: 45 ఏళ్లు పూర్తి చేసుకున్న సతీ సావిత్రి… ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు ఇవే!

Sati Savitri: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ నటులుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఎన్టీఆర్ కృష్ణంరాజు వంటి వాళ్లు ఎన్నో ప్రేమ కథ చిత్రాలతో పాటు పౌరాణిక సినిమాలలో కూడా నటించారు. ఇలా ఎన్నో అద్భుతమైన పౌరాణిక సినిమాలలో నటించి మెప్పించిన సినిమాలలో సతీ సావిత్రి కూడా ఒకటి.

ఎన్టీఆర్, కృష్ణంరాజు, వాణిశ్రీ, గుమ్మడి, కాంతారావు, జమున అంజలీదేవి వంటి ఎంతో మహామహులుగా పేరు సంపాదించుకున్న అతిపెద్ద తారాగణం కలిసిన నటించిన చిత్రం సతీసావిత్రి. ఈ సినిమా 1978 జనవరి 4వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాని లలిత శివ జ్యోతి స్టూడియోస్ బ్యానర్ పై ఏ శంకర్ రెడ్డి నిర్మించగా ఈ చిత్రానికి బిఎ సుబ్బారావు దర్శకత్వం వహించారు.

ఇక ఈ సినిమా 2023 డిసెంబర్ 4వ తేదీకి 45 సంవత్సరాలు పూర్తి అయింది. మహా పతివ్రత అయిన సతీ సావిత్రి జీవితం జగద్విదితం.. ఆమె జీవిత కథకు కొన్ని హంగులు చేర్చి ఎంతో అద్భుతమైన చిత్రంగా విజయవంతంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇందులో సావిత్రి పాత్రలో వాణిశ్రీ,సత్యవంతుని పాత్రలో కృష్ణంరాజు యముడి పాత్రలో ఎన్టీఆర్ ఎంతో అద్భుతమైన నటనను కనపరిచారు.

Sati Savitri: హిందీలో కూడా డబ్ అయిన సతీసావిత్రి..

సత్యవంతుని అర్థాయుషు కలిగి తనకు పాము కరిచి చనిపోతుండగా సతీ సావిత్రి ఆ యముడితో పోరాడి తన భర్త ప్రాణాలను కాపాడుకుంటుంది. ఇలా సతీ సావిత్రి తెలివితేటలకు మెచ్చిన యమధర్మరాజు వారిని ఆశీర్వదించి వారికి రాజ్యంతో పాటు భోగభాగ్యములను ప్రసాదించారు. అయితే ఈ సినిమా అప్పట్లో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది. ఈ సినిమా అప్పట్లోనే వందరోజులకు పైగా ఆడటమే కాకుండా 1981 వ సంవత్సరంలో ఈ సినిమా హిందీలో కూడా డబ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago