Sati Savitri: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ నటులుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఎన్టీఆర్ కృష్ణంరాజు వంటి వాళ్లు ఎన్నో ప్రేమ కథ చిత్రాలతో పాటు పౌరాణిక సినిమాలలో కూడా నటించారు. ఇలా ఎన్నో అద్భుతమైన పౌరాణిక సినిమాలలో నటించి మెప్పించిన సినిమాలలో సతీ సావిత్రి కూడా ఒకటి.

ఎన్టీఆర్, కృష్ణంరాజు, వాణిశ్రీ, గుమ్మడి, కాంతారావు, జమున అంజలీదేవి వంటి ఎంతో మహామహులుగా పేరు సంపాదించుకున్న అతిపెద్ద తారాగణం కలిసిన నటించిన చిత్రం సతీసావిత్రి. ఈ సినిమా 1978 జనవరి 4వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాని లలిత శివ జ్యోతి స్టూడియోస్ బ్యానర్ పై ఏ శంకర్ రెడ్డి నిర్మించగా ఈ చిత్రానికి బిఎ సుబ్బారావు దర్శకత్వం వహించారు.
ఇక ఈ సినిమా 2023 డిసెంబర్ 4వ తేదీకి 45 సంవత్సరాలు పూర్తి అయింది. మహా పతివ్రత అయిన సతీ సావిత్రి జీవితం జగద్విదితం.. ఆమె జీవిత కథకు కొన్ని హంగులు చేర్చి ఎంతో అద్భుతమైన చిత్రంగా విజయవంతంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇందులో సావిత్రి పాత్రలో వాణిశ్రీ,సత్యవంతుని పాత్రలో కృష్ణంరాజు యముడి పాత్రలో ఎన్టీఆర్ ఎంతో అద్భుతమైన నటనను కనపరిచారు.

Sati Savitri: హిందీలో కూడా డబ్ అయిన సతీసావిత్రి..
సత్యవంతుని అర్థాయుషు కలిగి తనకు పాము కరిచి చనిపోతుండగా సతీ సావిత్రి ఆ యముడితో పోరాడి తన భర్త ప్రాణాలను కాపాడుకుంటుంది. ఇలా సతీ సావిత్రి తెలివితేటలకు మెచ్చిన యమధర్మరాజు వారిని ఆశీర్వదించి వారికి రాజ్యంతో పాటు భోగభాగ్యములను ప్రసాదించారు. అయితే ఈ సినిమా అప్పట్లో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది. ఈ సినిమా అప్పట్లోనే వందరోజులకు పైగా ఆడటమే కాకుండా 1981 వ సంవత్సరంలో ఈ సినిమా హిందీలో కూడా డబ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది.































