Movie News

Bandla Ganesh : బండ్ల గణేష్ అన్న స్పీచ్ పై రేగిందిగా దుమారం… డార్లింగ్ ఫ్యాన్స్ కి వచ్చిందిగా కోపం..!

Bandla Ganesh : పూరి ఆకాష్ పూరి జగన్నాథ్ కొడుకుగా సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా ఇంకా ఒక హిట్ సినిమా పడి స్టాండ్ అవ్వలేదు. అయితే అంతకుముందు సినిమాల సంగతేంటో కానీ తాజాగా నేడు విడుదల కాబోతున్న ఆకాష్ పూరి కొత్త సినిమా చోర్ బజార్ సినిమా విషయంలో మాత్రం రచ్చ జరుగుతోంది. దీనికి కారణం మనం బండ్లన్నే. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చిన బండ్ల గణేష్ అదిరిపోయే స్పీచ్ ఇచ్చాడు. ఈ ఫంక్షన్స్ కి ఆకాష్ పూరి కోసం పూరి జగన్నాథ్ రాకపోవడంతో బాగా డౌట్స్ వచ్చాయి అందరికి. ఇక అనుమానాలకు బలం చేకూర్చేలా మాట్లాడి బండ్ల గణేష్ అన్న మరింత రచ్చ చేసాడు.

100 కోట్లు తీసుకుంటున్న హీరోలు.. ఒకప్పుడు జోల పాడారు …

ఇక బండ్ల గణేష్ స్పీచ్ మొదటగా ఎమోషనల్ గా సాగి పూరి జగన్నాథ్ భార్య లావణ్యను భూమాత, సీతా దేవుతో పోలుస్తూ వదిన లాంటి వాళ్ళను చూడలేదంటూ, పిల్లలకోసమే తాను బ్రతుకుతోందంటూ మాట్లాడాడు. ఇక కొడుకు కోసం ముంబై నుండి రాలేవా అన్నా అంటూ పూరి జగన్నాథ్ ను ఉద్దేశించి మాట్లాడాడు. ఇక ఆకాష్ ఎప్పటికైనా గొప్ప స్టార్ హీరో అవుతావని, మీ నాన్న ఎంతో మందిని మెగాస్టార్లను, సూపర్ స్టార్లను చేసాడు. డైలాగులు రాని వాళ్లను ఈరోజు పెద్ద స్టార్లను చేసాడు. ఈరోజు పాన్ ఇండియా సినిమాలు చేస్తూ 100 కోట్లు తీసుకుంటున్న హీరోలు నీ కోసం రారు, ఒకప్పుడు నీకు జోల పాడిన వాళ్ళు ఇప్పుడు నీకోసం నీ సినిమా ప్రచారానికి రారు. ఎందుకంటే వారికి భయం నువ్వు ఎక్కడ పెద్ద స్టార్ హీరో అయ్యి వారికి పోటీ వస్తావో అని అంటూ మాట్లాడాడు బండ్ల గణేష్. అయితే ఈ మాటలు ప్రభాస్ ను ఉద్దేశించి అని ప్రభాస్ అభిమానులు మండిపోతున్నారు.

దీనికి కారణం దాదాపు 100 కోట్లు తీసుకుంటున్న హీరో ఇపుడు టాలీవుడ్ లో ప్రభాస్ మాత్రమే. అందుకే ప్రభాస్ ఫ్యాన్స్ బండ్ల గణేష్ పై ఫైర్ అవుతున్నారు. ప్రభాస్ తో పూరి తీసిన రెండు సినిమాల్లో ఒకటి యావరేజ్ అయితే మరోకటి ప్లాప్ సినిమా, తానేమీ పెద్ద స్టార్ ని చేయలేదు. అయినా ప్రభాస్, ఆకాష్ పూరి సినిమా రొమాంటిక్ ప్రచార కార్యక్రమాల్లో మాట్లాడారు ఒకరోజంతా ఆకాష్ కోసం కేటాయించారు. అలాంటప్పుడు బండ్ల గణేష్ ఇలా ఎలా మా హీరోని టార్గెట్ చేసి మాట్లాడుతారు అంటూ ఫైర్ అవుతున్నారు ప్రభాస్ అభిమానులు. దీనికి బండ్లన్న ఏం సమాధానం చెబుతాడో చూడాలి.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago