Bandla Ganesh : క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చిన్న చిన్న పాత్రలు వేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న బండ్ల గణేష్ ఆ తరువాత ప్రొడ్యూసర్ గా మారి సినిమాలను నిర్మించారు. ఎన్నో కాంట్రావెర్సీలకు కేర్ ఆఫ్ గా నిలబడిన బండ్ల గణేష్ ఒకప్పుడు స్టార్ హీరోల్తో సినిమాలను తీసి వరుస హిట్లను చూసారు. ప్రస్తుతం సినిమా నిర్మాణంలో లేకపోయినా పాలిటిక్స్ గురించి అలానే సినిమా ఇండస్ట్రీ గురించి తనదైన శైలిలో మాట్లాడుతూ బాగా సోషల్ మీడియాలో నానే బండ్ల అన్న తన సినిమాల గురించి సినిమా నిర్మాణం గురించి ఆసక్తికర వాఖ్యలను చేసారు.
కుల పిచ్చి అంటూ మాటలెందుకు…
బండ్ల గణేష్ రాజకీయాల గురించి మాట్లాడను అంటూనే రాజకీయాలలో వేలు పెడుతూ కామెంట్స్ చేస్తూ వైరల్ అవుతూ ఉంటాడు. ఇక ఇటీవల విజయసాయి రెడ్డి ట్వీట్ కు స్పందిస్తూ కులం గురించి మాట్లాడొద్దు అంటూ బండ్ల గణేష్ చేసిన వాఖ్యలకు సమాధానం చెప్పారు బండ్ల. విజయ సాయి రెడ్డి టీడీపీ ని, చంద్రబాబు నాయుడుని విమర్శించుకోవాలనుకుంటే విమర్శించుకోవచ్చు. అంతే కానీ కమ్మ కులం అని పెట్టి ఎందుకు అందరినీ కలిపి తిట్టడం, నాకు నచ్చలేదు అంటూ బండ్ల వాఖ్యాణించారు.
కుల గజ్జి, కుల పిచ్చి, పచ్చ కులం అంటూ విజయ సాయి మాట్లాడటం నాకు నచ్చలేదు అందుకే అలా ట్వీట్ చేశాను. అంతే కానీ నేను టీడీపీ పార్టీ కాదు. నాకు కాంగ్రెస్ అంటే ఇష్టం నేను ఆ పార్టీ లోనే ఉన్నాను అంటూ క్లారిటీ ఇచ్చారు. నాకు నా కులం మీద ఇష్టం ఏమీ లేదు కానీ కులాన్ని తిట్టడం కరెక్ట్ కాదని అలా చెప్పానంతే అంటూ చెప్పారు బండ్ల. నాకు నా కులం వారు ఎవరూ సహాయం చేయలేదు నేను ఇంతవరకు ఎదిగింది ఇతర కులం వాళ్ళ వల్లే, నా స్నేహితులు వాళ్ళే అంటూ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…