Featured

Domalaguda Rameswari : ఎన్ఆర్ఐ సంబంధం అని చేస్తే అమెరికా పోయిన వారంకే టార్చర్ చూపించిన భర్త… న్యాయం కావాలంటూ అత్తింటి ముందు ఆందోళన..!

Domalaguda Rameswari : విదేశాలలో ఉద్యోగం, చేతి నిండా సంపాదన ఇక మా పిల్లను బాగా చూసుకుంటాడు అని భావించి వరుడు అక్కడ ఎలా ఉన్నడో ఎలాంటి వాడో కూడా చూసుకోకుండా ఎన్ఆర్ఐ సంబంధం మోజులో పెళ్లిళ్లు చేసి మోసపోతున్న ఎంతోమంది తల్లిదండ్రులను చూస్తూనే ఉన్నాం. మరోసారి అలాంటి ఘటనే పునరావృతం అయింది. దోమలగూడకు చెందిన యువతికి అమెరికాలో ఉద్యోగం చేస్తున్న వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయగా వారం తిరగక ముందే చుక్కలు చూపించాడు. ఏకంగా విడాకుల నోటీసు ఇచ్చి ఇదంతా కామన్ లైట్ తీస్కో అంటున్నాడు.

రాత్రిళ్ళు హార్రర్ సినిమాలు చూపి టార్చర్…

హైదరాబాద్ లోని హిమాయత్ నగర్ దోమల్ గూడా ప్రాంతానికి చెందిన రామేశ్వరి ఎంఎస్సి చేసింది. యూసుఫ్ గూడకు చెందిన మహేష్ అనే వ్యక్తితో పెళ్లి సంబంధం కుదిర్చారు. పైగా మహేష్ అమెరికాలో ఉద్యోగం చేస్తుండడంతో మంచి సంబంధం అని మహేష్ కి ఇచ్చి రామేశ్వరికి పెళ్లి చేసారు. ఇక మహేష్ రామేశ్వరి లకు గతేడాది మే 26న వివాహం ఘనంగా జరిగింది. పెళ్లి సమయంలో రామేశ్వరి తల్లిదండ్రులు మహేష్ కు వరకట్నం రూ.10 లక్షలతో పాటు అమ్మాయికి 20 తులాల బంగారం పెట్టారు. ఇక పెళ్ళైన కొద్దిరోజులకు జూలై 18న మహేష్ తన భార్య రామేశ్వరిని అమెరికా తీసుకెళ్లాడు. అమెరికాలోని టెక్సస్ లో ఉన్న మహేష్ దంపతులు వారం రోజులు సంతోషంగానే ఉన్నా ఆ తరువాత భార్యను వేదించడం మొదలు పెట్టాడు. రాత్రి పూట హార్రర్ సినిమాలు చూలి బయపెట్టడం మొదలు ఇంటి నుండి బయటకు వెళ్ళకూడదంటూ హుకుం జారీ చేసాడు.

అదనపు కట్నం కోసం వేదించడం మొదలు పెట్టాడు. ఇదే కాకుండా పక్కింటి వ్యక్తులతో మాట్లాడొద్దని, బయట కూర్చొవద్దనే ఆంక్షలు కూడా విధించాడు. ఇక తన స్నేహితులందరూ డ్రగ్స్ తీసుకునేవారట, వారి ముందు కూర్చొని మాట్లాడమని పొట్టి బట్టలు వేసుకోవాలంటూ హేళన చేసేవాడట. నిన్ను పెళ్లి చెసుకోకుండా ఉండి ఉంటే 50 లక్షల కట్నం వచ్చే సంబంధం వచ్చేది అంటూ టార్చర్ చేసేవాడట. ఇక తల్లికి బాలేదని చెప్పి మళ్ళీ ఇండియా తీసుకువచ్చిన మహేష్ చెప్పకుండా అమెరికా వెళ్ళిపోయాడు. ఆ తరువాత రామేశ్వరి ఒంటరిగా అమెరికా వెళ్లినా ఇంట్లోనే ఉండాలని వంట చేసుకోడానికి సరుకులు కూడా తెచ్చివ్వకుండా వేధించడం, బాత్రూంలో కూడా సీసీటీవీ అమర్చడం ఇవన్నీ భరించలేక ఒక అమెరికా మహిళ సహాయంతో ఇండియా వచ్చిన రామేశ్వరి తన భర్త అత్తింటి వేధింపులకు పోలీస్ ఫిర్యాదు చేసి అత్తింటి ముందు ధర్నా చేస్తోంది.

Bhargavi

Recent Posts

ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకండి.. ఈ సులభమైన చిట్కాలతో మళ్లీ తాజాగా మార్చుకోవచ్చు

తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…

1 day ago

హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే బెడ్ కింద వాటర్ బాటిల్ వేయాలంటున్నారు.. కారణం ఏమిటో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…

1 day ago

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ ఉద్యోగాలు..

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

1 day ago

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

1 day ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

1 day ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

2 days ago