Bandla Ganesh: బండ్ల గణేష్ తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ముందు నుంచి కూడా ఎంతో గట్టి నమ్మకంతో ఉన్నారు. ఎన్నికలు జరిగిన తర్వాత తొమ్మిదవ తేదీ ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం జరుగుతుందని అయితే నేను ఏడో తేదీ రాత్రి నుంచి అక్కడే ఉంటానని మీడియాతో ఈయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలు నిజమయ్యాయి. చివరికి ఈయన ఊహించిన విధంగానే కాంగ్రెస్ పార్టీ విజయం అందుకుంది. ఇలా కాంగ్రెస్ పార్టీ గెలవడంతో బండ్ల గణేష్, కేటీఆర్ పట్ల తీవ్రస్థాయిలో విమర్శలు కురిపించారు.
ముఖ్యంగా కేటీఆర్ గన్ను పట్టుకొని ఉన్న ఫోటోనీ షేర్ చేస్తూ…3.0 అంటూ వచ్చే ఎన్నికలలో మేమే గెలుస్తామని ఒక పోస్ట్ చేశారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలవడంతో ఈ ఫోటో పట్ల బండ్ల గణేష్ కామెంట్ చేశారు. కేటీఆర్ గన్ను పట్టుకున్నారు కానీ బుల్లెట్ రివర్స్ లో పెట్టారని అది తిరిగి వారికి తగిలిందని బారాస ఓడిపోవడానికి కేటీఆర్ బుల్లెట్ రివర్స్ పెట్టడమే కారణం అంటూ ఈయన కేటీఆర్ పట్ల చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇక ఆయన గన్ను గురిపెట్టడం చూస్తే రాత్రికి రాత్రి బ్యాలెట్ బాక్స్ లు ఏమైనా చేశారా అన్న భయం కూడా కలిగి నేను బ్యాలెట్ బాక్స్ లు జాగ్రత్త అంటూ కార్యకర్తలను కోరానని తెలిపారు. అయితే కేటీఆర్ గన్ను గురిపెట్టడం చూస్తే నాకు అతడు సినిమానే గుర్తుకు వచ్చింది. అంటూ ఈయన కేటీఆర్ పై కామెంట్ చేశారు. అధికారంలో ఉన్నప్పుడు గర్వంతో మేము మనుషులం కాదు దేవుళ్ళమంటూ గొప్పలు చెప్పుకున్నారు.
గర్వంతో మాట్లాడారు..
నేనెప్పుడూ కేసీఆర్ హరీష్ రావు పై కామెంట్ చేయడం చంద్రబాబు నాయుడును అరెస్టు చేసి పెద్ద ఎత్తున అందరూ ధర్నాలకు దిగితే కేటీఆర్ గర్వంతో మీరు విజయవాడకు పోయి ధర్నాలు చేసుకోండి హైదరాబాదులో కాదు అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇది భారతదేశం అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి అంటూ ఈ సందర్భంగా బండ్ల గణేష్ కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చినంత పని చేశారు. ప్రస్తుతం కేటీఆర్ పట్ల బండ్ల గణేష్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…