Venkatesh Daughters: విక్టరీ వెంకటేష్ సినిమా ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగే సినిమాలలో నటించి ఎంతో మంది ఫ్యామిలీ ఆడియన్స్ ని సొంతం చేసుకున్నారు. ఇక సినిమాల పరంగా హీరోగా ఎంతో మంచి సక్సెస్ అయినటువంటి ఈయన వ్యక్తిగతంగా మాత్రం సోషల్ మీడియాకు చాల దూరంగా ఉంటారనే సంగతి తెలిసిందే. వెంకటేష్ మాత్రమే కాకుండా తన భార్య పిల్లలను కూడా సోషల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉంచారు.
వెంకటేష్ నీరజ అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు ఈ దంపతులకు నలుగురు సంతానం ఇందులో ముగ్గురు అమ్మాయిలు కాగా ఒక అబ్బాయి ఉన్నారు. వెంకటేష్ పిల్లలు కూడా ఏదైనా ఫంక్షన్లలో మినహా బయట ఎప్పుడు ఎక్కడ కనిపించరు అయితే ఇండస్ట్రీకి సోషల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉన్నటువంటి వెంకటేష్ పిల్లలు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారనే విషయానికి వస్తే..
వెంకటేష్ పెద్ద కుమార్తె పేరు ఆశ్రిత ఈమెకు ఇదివరకే పెళ్లి జరిగిన సంగతి మనకు తెలిసిందే. ఇక ఈమె వెంకటేష్ కూతురుగా కాకుండా ఫుడ్ బ్లాగ్స్ చేస్తూ అందరికీ దగ్గర అయింది ఫుడ్ కి సంబంధించిన ఫోటోలని ఆమె పంచుకుంటూ ఉంటుంది. ఇలా యూట్యూబ్ ద్వారా కొన్ని లక్షల మంది ఫాలోవర్స్ ని సొంతం చేసుకున్నటువంటి ఈమె ప్రస్తుతం తన భర్తతో కలిసి రెస్టారెంట్ ప్రారంభించారు.
ఇండస్ట్రీకి దూరం…
రెండవ కుమార్తె హయ వాహిని ఈమె డిజైనింగ్ కోర్సు పూర్తి చేసి డిజైనర్ గా స్థిరపడ్డారు. త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది ఇప్పటికి విజయవాడకు చెందిన ఓ ప్రముఖ డాక్టర్ తో తనకు నిశ్చితార్థం కూడా ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఇకపోతే మూడవ కుమార్తె భావన ఈమె కూడా డిగ్రీ వరకు చదువులు పూర్తిచేసింది. అయితే తనకు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం ఉండడంతో అదే రంగం వైపు అడుగులు వేస్తున్నారు. ఇక చివరిగా వెంకటేష్ కు కుమారుడు అర్జున్ రామనాథ్ జన్మించారు. ఈ అబ్బాయి కూడా ప్రస్తుతం విదేశాలలో ఉన్నత చదువులను చదువుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…