Categories: FeaturedMovie News

Bappi Lahiri : ‘భాష రాదు..భావం తెలీదు.. ఇతనెందుకు మ్యూజిక్ డైరెక్టర్‌గా’ అన్నారు.. కానీ ఆయనే బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు..

సౌత్ సినిమా ఇండస్ట్రీలో గానీ బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో గానీ ఎప్పుడు కొందరు కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తే కొందరు మాత్రం వాళ్ల మూలాలు ఎక్కడ వేళ్ళతో సహా పీకేస్తారో అనే అభద్రతా భావంతో కొత్త వాళ్లని ఎంకరేజ్ చేయకుండా వీలైనంతవరకు తమకున్న పరపతి, పరిచయాలతో కొత్తవారిని రానివ్వకుండా చేసేవారు. ఇండస్ట్రీలో ఈ ధోరణి ఇప్పటికీ మారలేదంటే.. మారలేదనే చెప్పాలి. మనం మాత్రమే బావుండాలి.. పక్కన వాడు ఎదగకూడాదనే కుళ్ళు.. కుతంత్రాలతో వ్యసనంతో తొక్కాలని చూసేవాళ్ళు ఇప్పటికీ ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు.

ఒక దశలో బాలీవుడ్ సంగీత దర్శకుడి విషయంలో ఇదే జరిగిందట. ఆయనే బప్పీలహిరి. బొద్దుగా ఉన్నా ఉంగరాల జుట్టు, కళ్ళకి గాగూల్స్, మెడలో చైన్స్, బ్రాస్‌లెట్స్ వంటి ధరించి చాలా స్టైలిష్‌గా కనిపిస్తారు. అప్పటికీ ఇప్పటికీ ఆయనలో రాని మార్పు అంటే ఇది..ఆయన కంపోజ్ చేసే మ్యూజిక్. ఇండియన్ సింగర్ గా, కంపోజర్ గా యాక్టర్ గా రికార్డ్ ప్రొడ్యూసర్ గా దేశ వ్యాప్తంగా ఎంతో పాపులర్ అయ్యారు. ఆయన సంగీతం అందించిన సినిమాలన్ని మ్యూజికల్‌గా బ్లాక్ బస్టర్ అయ్యాయి. హీరోలు బప్పీలరి సాంగ్స్ అంటే ఊగిపోయేవారు. ఆయన మాంచి ఊపున్న సాంగ్స్ ఇచ్చారు.

అయితే బప్పీలహిరి తెలుగులో సంగీతం అందించిన మొదటి సినిమా సూపర్ స్టార్ కృష్ణ నటించిన సింహాసనం. తెలుగులో సినిమాస్కోప్ లో పద్మాలయా సంస్థ మొదటి సారిగా నిర్మించిన సినిమా. అంతేకాదు తెలుగులో మొదటి 70 ఎం.ఎం.లో నిర్మించిన చిత్రం. ఇక్కడ మరో విశేషం కృష్ణ దర్శకునిగా ఈ చిత్రంతోనే పరిచయమయ్యారు. సింహాసనం చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే కూడా అందించడంతో పాటు ఎడిటింగ్ కూడా చూశారు.

ఈ చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా 1986లో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఆయన మొదటి సినిమాకి అద్భుతమైన పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమాకి కృష్ణ పంతానికి పోయి బప్పీ లహరిని తీసుకున్నారు. అప్పటికే బాలీవుడ్ ఆయన సంగీతం అందించిన సినిమాలు సూపర్ హిట్‌గా నిలిచాయి. అయితే సింహాసనంకి సంగీత దర్శకుడిగా బప్పీలహిరిని తీసుకున్నందుకు కృష్ణని చాలామంది వారించారట. ఆయనకి తెలుగు భాష రాదు, ఇక్కడ కల్చర్ తెలీదు.. పైగా డిస్కో సాంగ్స్ కంపోజ్ చేసే దర్శకుడు.. హిందీ వాడు. ఆయనకి ఇంత పెద్ద ప్రాజెక్ట్ అప్పగించడం ఏంటి మీరు మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో రాంగ్ స్టెప్ వేస్తున్నారని చెప్పారట.

కానీ కృష్ణ వినిపించుకోలేదు. సింహాసనం సినిమాతో ఆయన చాలా ప్రయోగాలు చేశారు. మార్కెట్‌ని బడ్జెట్ కేటాయించారు. డైరెక్షన్ అందరూ వద్దని చెప్పినా ఆయనే దర్శకత్వం వహించారు. కథ, స్క్రీన్ ప్లే నిర్మాణం, ఫస్ట్ 70 ఎం.ఎం. సినిమా ఇలా చేసిన ప్రయోగాలలో సంగీత దర్శకుడిగా బప్పీలహరిని ఎన్నుకోవడం. అందరూ ఒక మాట మీద ఉంటే ఆయన మాత్రం తన పంథాలోనే కొనసాగారు. సింహాసనం ఆడియో సూపర్ హిట్. సినిమా రిలీజయ్యాక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయిందని అందరూ మెచ్చుకున్నారు. ఆ తర్వాత మెగాస్టార్ నటించిన స్టేట్ రౌడీ, సామ్రాట్, గ్యాంగ్ లీడర్ , రౌడీ అల్లుడు, రౌడీ ఇన్‌స్పెక్టర్, బిగ్ బాస్, బ్రహ్మ సినిమాలకి సూపర్ హిట్ ఆల్బంస్ ఇచ్చారు. 

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

5 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago