Beast vs Kgf : కేజీఎఫ్ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలై సినిమాకు హిట్ టాక్ సొంతం చేసుకుని దూసుకుపోతోంది. బాషా, ప్రాంతీయ బేధాలు లేకుండా అన్ని చోట్ల సినిమా దూసుకుపోతోంది. తెలుగులో డబ్బింగ్ సినిమాల రికార్డులను బద్ధలు కొడుతూ కొత్త రికార్డులను సృష్టిస్తోంది. తెలుగునాట యష్ కీ ఫ్యాన్ ఫాలోయింగ్ మాములుగా లేదు.
బీస్ట్ ను బీట్ చేసిన కేజీఎఫ్2……
కేజీఎఫ్ చాప్టర్ 2 కంటే ఒకరోజు ముందు విజయ్ నటించిన బీస్ట్ విడుదలయింది. బీస్ట్ సినిమా ముందు కేజీఎఫ్ నిలబడదని అభిమానులు అనుకున్నారు. ఇక కేజీ ఎఫ్ లాటరీ లాంటి సినిమా అంటూ కామెంట్స్ చేసారు. ఇక కేజీఎఫ్ కంటే ఎక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన బీస్ట్ సినిమా బాక్స్ ఆఫీస్ ముందు బోల్తా కొట్టింది.బీస్ట్ మూవీ తమిళ్ లో 9 రోజులు పూర్తయ్యేసరికి రూ.61.17 కోట్లు కలెక్ట్ చేయగా కేజీఎఫ్ చాప్టర్ 2 మూవీ 8 రోజులకే అక్కడ రూ.64.04 కోట్లు కొల్లగొట్టింది. నిన్నటి రోజున అక్కడ బీస్ట్ మూవీ రూ.1.04 కోట్లను కలెక్ట్ చేయగా కేజీఎఫ్ చాప్టర్ 2 మూవీ రూ.4.20 కోట్లను కలెక్ట్ చేసింది.
2016 లో అచ్చం ఇలాంటి సీనే రిపీట్ అయింది. మహేష్ బాబు బ్రహ్మోత్సవం సినిమా విడుదలయి ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ఇక అదే టైం లో కొంచెం ముందు విడుదలైన బిచ్చగాడు సినిమా సూపర్ హిట్ అయింది.60కోట్ల బడ్జెట్ సినిమా కోటి రూపాయల బడ్జెట్ మూవీ బీట్ చేసింది. ఇది అప్పట్లో సంచలనం.సీడెడ్ వంటి కొన్ని చోట్ల ‘బ్రహ్మోత్సవం’ మూవీ కంటే ఎక్కువ కలెక్ట్ చేసి ట్రేడ్ కు సైతం షాక్ ఇచ్చింది. అలా ఇపుడు కేజీఎఫ్ కూడా తమిళ నాట పెద్ద మార్కెట్ ఉన్న విజయ్ లాంటి హీరోతో తలపడి ఆ సినిమా కంటే ఎక్కువ వసూళ్లను రాబట్టుకుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…