అందాన్ని రెట్టింపు చేసే ఆలూ.. ఈ చిట్కాలు పాటిస్తే చాలు?

సాధారణంగా ప్రతి ఒక్కరు ఎంతో అందంగా కనపడాలని భావిస్తారు.ఈక్రమంలోనే మార్కెట్లో దొరికే వివిధ రకాల సౌందర్య ఉత్పత్తులను కొనుగోలు చేసి తమ అందాన్ని రెట్టింపు చేసుకోవాలని భావిస్తారు.అయితే మార్కెట్లో దొరికే ప్రోడక్ట్ వివిధ రకాల రసాయనాలతో తయారు చేసి ఉంటారు. కనుక చర్మానికి కొంతవరకు ప్రమాదకరంగా మారవచ్చు. కనుక సహజసిద్ధంగా మన అందాన్ని రెట్టింపు చేసుకోవడంతో ఎలాంటి ప్రభావాలు లేకుండా అందమైన చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు. మరి మన అందాన్ని రెట్టింపు చేయడానికి ఆలూ ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది.

బంగాళా దుంపలలో ఎన్నో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ముఖ్యంగా విటమిన్ సి,విటమిన్- B6, పొటాషియం,థయామిన్, రైబోఫ్లావిన్, ఫోలేట్, నియాసిన్, మెగ్నీషియం, ఐరన్, జింక్ లాంటి మూలకాలు సైతం ఆలూలో ఉన్నాయి. అదేవిధంగా బంగాళా దుంపలలో కార్టినాయిడ్స్, పాలీఫినాల్స్ తదితర ఫైటో రసాయనాలు ఉన్నాయి.

ఎన్నో పోషకాలు కలిగిన బంగాళదుంప కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా మన అందాన్ని రెట్టింపు చేయడానికి దోహదపడుతుంది.కళ్ళకింద నల్లటి వలయాలతో బాధపడేవారు బంగాళదుంపల నుంచి తీసిన రసాన్ని కాటన్ సహాయంతో తీసుకొని కళ్ళ కింద సుమారు 15 నిమిషాల పాటు మర్దన చేయడం ద్వారా కంటి కింద ఉన్న మచ్చలు నల్లటి వలయాలు తొలగిపోతాయి.ఈ బంగాళా దుంప రసంతో ప్రతిరోజు మన ముఖాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల చర్మం పై ఏర్పడిన ముడతలు తొలగిపోతాయి.

ఎంతో కాంతివంతమైన చర్మం పొందాలనుకునేవారు బంగాళదుంప రసంలోకి ఒక టీ స్పూన్ ముల్తాని మట్టి కలిపి ఆ మిశ్రమాన్ని మొహానికి ప్యాక్ వేసుకోవాలి. ఓ అరగంట తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల మొహం పై ఏర్పడిన మృతకణాలు తొలగిపోయి ముఖం ఎంతో కాంతివంతంగా ఉంటుంది. బంగాళదుంపను మిక్సీలో మెత్తని మిశ్రమంలా తయారు చేసి ఆ మిశ్రమాన్ని మొహానికి రాసుకుని అరగంట తర్వాత శుభ్రం చేసుకుంటే ముఖం ఎంతో మృదువుగా మారుతుంది. బంగాళాదుంపతో ఈ చిట్కాలు పాటించడం వల్ల అందమైన, కాంతివంతమైన చర్మాన్ని మీ సొంతం చేసుకోవచ్చు