Indian Premier League: ఐపీఎల్ వేలానికి పేరు నమోదు చేసుకున్న బెంగాల్ మంత్రి..! వివరాల్లోకి వెళ్తే..
Indian Premier League: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( ఐపీఎల్ ) కోసం క్రికెట్ లవర్స్ ఎదురుచూస్తున్నారు. కరోనా కారణంగా గత రెండు సీజన్లు దుబాయ్ వేదికగా జరగడంతో ఫ్యాన్స్ నిరుత్సాహానికి గురయ్యారు. తాజాగా ఈ ఐపీఎల్ మాత్రం ఇండియాలోనే జరగుతున్నట్లు బీసీసీఐ ఇదివరకే క్లారిటీ ఇచ్చింది.
దీనికోసం త్వరలో ఐపీఎల్ కొత్త సీజన్ కోసం ఆటగాళ్ల వేలం కూడా ప్రారంభం అయింది. ఇప్పటికే అన్ని జట్లు తమ స్ట్రాటజీలతో ఉన్నాయి. ఏ ప్లేయర్ ను తీసుకోవాలనే క్లారిటీతో ఉన్నాయి. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్ జట్టు వేళంపై కసరత్తు చేస్తోంది. ఇప్పటికే మిస్టర్ కూల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని చెన్నైకి చేరుకున్నాడు. ఇతర జట్ల యాజమాన్యాలు కూడా ప్లేయర్ల వేలంపై కసరత్తు చేస్తున్నాయి.
తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ వార్త వినిపిస్తోంది. వెస్ట్ బెంగాల్ మంత్రి, త్రుణమూల్ కాంగ్రెస్ నేత మనోజ్ తివారీ కూడా ఈసారి ఐపీఎల్ వేలంలో నిలవనున్నారు. తన పేరును వేలం కోసం నమోదు చేసుకున్నాడు. క్రికెట్ అయిన మనోజ్ తివారీ గతేడాది బెంగాల్ ఎన్నికల్లో త్రుణమూల్ కాంగ్రెస్ తరుపున శిభ్ పూర్ స్థానం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తరువతా మమతా బెనర్జీ మంత్రి వర్గంలో క్రీడల శాఖ మంత్రి పనిచేస్తున్నాడు.
ప్రస్తుతం వేలంలో పేరు నమోదు చేసుకున్న మనోజ్ తివారీ.. తన ప్రారంభం ధరను రూ. 50 లక్షలుగా పేర్కొన్నాడు. గతంలో ఇండియా తరుపున పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడాడు. మొత్తం 12 వన్డేలు, 3 టీ20 మ్యాచ్లు ఆడాడు. ఐపీఎల్ టోర్నీలో కోల్ కతా నైట్ రైడర్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, రైజింగ్ పూణే జాయింట్ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…