Categories: FeaturedHealth News

కరోనా ప్రమాదాన్ని తగ్గించే ఆహారపదార్థాలివే..?

దేశంలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాలుస్తోంది. అడ్డూఅదుపు లేకుండా వ్యాప్తి చెందుతున్న ఈ మహమ్మారి వల్ల అంచనాలకు మించి కేసులు నమోదవుతున్నాయి. వ్యాక్సిన్, వైరస్ పై సమర్థవంతంగా పని చేసే ఔషధాలు అందుబాటులోకి వచ్చేంతవరకు మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం ద్వారా మాత్రమే వైరస్ బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో వైరస్ బారిన పడకుండా ఉండాలంటే రొగ నిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోవాలి.

ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలు కరోనా మహమ్మారిని కట్టడి చేసే వ్యాక్సిన్ కోసం అనేక ప్రయోగాలు చేస్తున్నారు. అయితే శాస్త్రవేత్తలు పోషకాలు ఉండే ఆహారం తినడం వల్ల కరోనా మరణాల ముప్పును అడ్డుకోవచ్చని తెలుపుతున్నారు. గతంలో శాస్త్రవేత్తలు కరోనా మరణాల ముప్పును తగ్గించుకోవడానికి సి విటమిన్, డి విటమిన్ అవసరమని చెప్పినా వీటితో పాటు ఇతర ఆహార పదార్థాలకు కూడా ప్రాధాన్యత ఉంటుందని చెబుతున్నారు.
 
ఎవరికైతే రక్తంలో జింక్ తక్కువగా ఉంటుందో వారికి వైరస్ సోకితే ప్రాణాలు పోయే ప్రమాదం ఎక్కువగా ఉందని బార్సిలోనాలోని టెర్షరీ యూనివర్సిటీ హాస్పిటల్‌ వైద్యులు తెలిపారు. శరీరంలో జింక్ కార్బోహైడ్రేట్ల విచ్ఛిన్నంతో కణాల పెరుగుదల, విభజన కోసం ఉపయోగపడుతుంది. శరీరంలో జింక్ స్థాయిలు పెరగాలంటే జింక్ ఎక్కువగా ఉన్న ఆహారపదార్థాలను తీసుకుంటే సరిపోతుంది.
 
చిక్కుళ్లలో మనకు కావాల్సినంత జింక్ లభిస్తుంది. చిక్కుళ్లు మొలకెత్తినవి లేదా ఉడకబెట్టినవి లేదా నానబెట్టినవి తింటే మంచిది. నువ్వులు, జీడిపప్పు, గుమ్మడికాయ గింజలు కూడా జింక్ ను శరీరంలో పెంచడంలో సహాయపడతాయి. పాలు, గుడ్లు, డార్క్ చాకెట్ తీసుకోవడం వల్ల కూడా శరీరానికి కావాల్సినంత జింక్ పుష్కలంగా లభిస్తుంది.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

6 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago