Bharadwaja : చిరంజీవి రెమ్యూనరేషన్ లో భారీ కోత… రెమ్యూనరేషన్ కోసం చిరు కొత్త ఫార్ములా, నిర్మాతల టెన్షన్ : భరద్వాజ

Bhardwaja : ఒకప్పుడు ఇండస్ట్రీ లో టాప్ హీరో.. ఆ హీరో సినిమా అనగానే టేబుల్ బిజినెస్ జరిగిపోయేది. సినిమా హిట్ ప్లాప్ తో సంబందం లేకుండా బిజినెస్ జరిగిన హీరో మెగాస్టార్. ‘స్వయం కృషి’ తో ఇండస్ట్రీని శాశించే స్థాయికి ఎదిగిన మెగాస్టార్ చాలా గ్యాప్ తరువాత మళ్ళీ ‘ఖైదీ నెంబర్ 150’ తో మళ్ళీ రేస్ లోకి వచ్చారు. ఇక లాక్ డౌన్ తరువాత ‘ఆచార్య’ సినిమాతో వచ్చాడు. కొడుకుతో కలిసి ఆచార్య సినిమా తీసినా అది డిజాస్టర్ గా మిగిలింది. ప్లాప్ హిట్ అని సంబంధం లేకుండా చిరు వరుస సినిమాలతో కుర్ర హీరోలకు ఏ మాత్రం తీసిపోనని సినిమాలు చేస్తున్నారు.

రెమ్యూనరేషన్ లో తగ్గిన చిరు…

వరుస పెట్టి సినిమాలనైతే చేస్తున్నారు కానీ చిరు ఇప్పుడు తీసుకుంటున్న పారితోషకం మీదే అందరికీ అనుమానాలు మొదలయ్యాయి. ఇప్పుడున్న కుర్ర హీరోల రెమ్యూనరేషన్ లతో అయన పోటీ పడలేరు. అలాగని తక్కువ తీసుకోవడం బాగోదు. మరి ఎలా అంటే.. ఆయన సినిమా అనుకున్నాక రెమ్యూనరేషన్ గురించి మళ్ళీ చూద్దాం ముందు సినిమా అవ్వనీ అంటూ చెప్తున్నారట. ఇక ఇదే విషయం గురించి సీనియర్ జర్నలిస్ట్ భారద్వాజ గారు స్పందించారు.

చిరంజీవి ప్రస్తుతం నిర్మాతల సమస్యల దృష్టిలో పెట్టుకుని రెమ్యూనరేషన్ గురించి ఆలోచించడం లేదని అయితే సినిమా విడుదల అయ్యాక రెస్పాన్స్ బట్టి రెమ్యూనరేషన్ అడగొచ్చని చెప్పారు. అయితే ఈ విషయంలో నిర్మాతలు టెన్షన్ పడుతున్నారంటూ చెప్పారు. ఒకవేళ సినిమా పూర్తయ్యాక ఏరియా హక్కులు అడిగినా లేకపోతే ఓటీటీ హక్కులు అడిగితే ఏంటి పరిస్థితి అని భయపడుతున్నారు అంటూ భరద్వాజ అభిప్రాయపడ్డారు. అయితే ఆయన మార్కెట్ కేవలం తెలుగు రాష్ట్రాలు మహా అయితే కర్ణాటక, తమిళనాడు అంతే కాబట్టి అంత రేంజ్ కే రెమ్యూనరేషన్ డిమాండ్ చేయగలరు. ఇప్పుడున్న పాన్ ఇండియా హీరోలతో పోల్చుకోవడం కరెక్ట్ కాదు అంటూ కామెంట్స్ చేసారు.