100 మిలియన్ల క్లబ్​లో భీమ్లా నాయక్ టైటిల్​సాంగ్.. సోషల్ మీడియాలో తెగ వైరల్..​!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. రానా దగ్గుబాటి లీడ్ క్యారెక్టర్లతో వస్తున్న పవర్ పుల్ మూవీ భీమ్లానాయక్.. ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మళయాళంలో బంఫర్ విక్టరీ సాధించిన అయ్యప్పనుమ్ కోషియం రిమేక్ గా భీమ్లానాయక్ తెలుగులో రిమేక్ అవుతోంది.

ప్రుథ్వీరాజ్ సుకుమారన్, బిజూ మీనన్ పోటా పోటీగా నటించిన మళయాళం సినిమా అక్కడ రికార్డ్ కలెక్షన్లను సాధించింది. దీంతో తెలుగులో కూడా విపరీతంగా హైప్ క్రియేట్ అయ్యింది. తెలుగులో పవన్ కళ్యాన్, రానాలు పోటీపోటీగా కనిపించనున్నారు.

సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలను అందిస్తున్నారు. మరోవైపు థమన్ మ్యూజిక్ ఆల్ రెడీ హిట్ అయింది. సితార ఎంటర్టైన్ మెంట్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా ఇప్పడు టైటిల్ సాంగ్ యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తోంది. భీమ్లానాయక్ అంటూ సాగే టైటిల్ సాంగ్ యూట్యూబ్ లో మారుమోగిపోతోంది. ఇప్పటికే ఈ సాంగ్ యూట్యూబ్ లో 100 మిలియన్ వ్యూస్ సాధించింది.

దీన్ని బట్టి చూస్తే పవన్ మాస్ ఇమేజ్ ఎంటో తెలుస్తోంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ట్వట్టర్ ద్వారా వెల్లడించింది. పవన్ ఇమేజ్ కు  అనుగుణంగా ప్రముఖ లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి ఈ పాటను రాశారు. జనవరి 12 న సంక్రాంతి కానుగా భీమ్లానాయక్ ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా విడులయిన తర్వాత మరెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.