Akhanda Movie: ఆ ప్రాంతంలో అఖండ సినిమా కలెక్షన్లను బ్రేక్ చేయలేకపోయిన భీమ్లా, పుష్ప, ఆర్ఆర్ఆర్..ఎక్కడంటే?

Akhanda Movie: ఆ ప్రాంతంలో అఖండ సినిమా కలెక్షన్లను బ్రేక్ చేయలేకపోయిన భీమ్లా, పుష్ప, ఆర్ఆర్ఆర్..ఎక్కడంటే?

Akhanda Movie: గత మూడు సంవత్సరాల నుంచి ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ అన్ని రంగాలకు తీవ్ర నష్టాన్ని కలిగించింది. ముఖ్యంగా వైరస్ ప్రభావం చిత్రపరిశ్రమకు కూడా భారీ నష్టాలను తీసుకు వచ్చిందని చెప్పాలి. అయితే కరోనా వైరస్ కారణంగా ఎన్నో పెద్ద సినిమాలు విడుదలకు నోచుకోలేక వాయిదా పడుతూ వచ్చాయి. ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో పెద్ద సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉండగా వైరస్ కారణంగా విడుదలకు వెనకాడరు.

Akhanda Movie: ఆ ప్రాంతంలో అఖండ సినిమా కలెక్షన్లను బ్రేక్ చేయలేకపోయిన భీమ్లా, పుష్ప, ఆర్ఆర్ఆర్..ఎక్కడంటే?
Akhanda Movie: ఆ ప్రాంతంలో అఖండ సినిమా కలెక్షన్లను బ్రేక్ చేయలేకపోయిన భీమ్లా, పుష్ప, ఆర్ఆర్ఆర్..ఎక్కడంటే?

ఇలాంటి సమయంలోనే బాలకృష్ణ ఎంతో ధైర్యం చేసి అఖండ సినిమాను విడుదల చేశారు. అయితే ఈ సినిమా విడుదలైన సమయంలో ఒకవైపు కరోనా వైరస్ వెంటాడుతూ ఉండగా మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో టికెట్ల రేట్లు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల నడుమ బాలకృష్ణ అఖండ సినిమా విడుదల అయ్యి తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంతో ధైర్యం నింపింది అని చెప్పాలి.

Akhanda Movie: ఆ ప్రాంతంలో అఖండ సినిమా కలెక్షన్లను బ్రేక్ చేయలేకపోయిన భీమ్లా, పుష్ప, ఆర్ఆర్ఆర్..ఎక్కడంటే?

కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో ఎవరైనా థియేటర్లకు వస్తారా? రారా అన్న అనుమానంతో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అఖండమైన విజయాన్ని అందుకొని మిగతా సినిమాలకు ధైర్యం నింపింది. అఖండ విడుదలైన తర్వాత అల్లు అర్జున్ పుష్ప, పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్, నాగార్జున బంగార్రాజు, రాజమౌళి త్రిబుల్ ఆర్ సినిమాలు వరుసగా విడుదలయ్యాయి. ఈ సినిమాలన్నీ మంచి కలెక్షన్లను కూడా రాబట్టాయి.

లక్షల్లో నష్టాలు….

ఇలా వరుసగా విడుదలైన ఈ సినిమాలలో ఏ సినిమా మంచి విజయం సాధించిందనే విషయానికి వస్తే బాలకృష్ణ నటించిన అఖండ సినిమా అంటూ డిస్ట్రిబ్యూటర్లు బల్లగుద్ది చెబుతున్నారు.ఈ సందర్భంగా డిస్ట్రిబ్యూటర్లు మాట్లాడుతూ గోదావరి జిల్లాలోని ఒక థియేటర్లో అఖండ సినిమా విడుదలైంది. ఇదే థియేటర్లోనే పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లానాయక్, బంగార్రాజు, పుష్ప, రాధే శ్యామ్, త్రిబుల్ ఆర్ సినిమాలు విడుదలయ్యాయి. అయితే ఒక్క అఖండ సినిమా తప్ప మిగిలిన సినిమాలన్నీ కూడా డిస్ట్రిబ్యూటర్లకు లక్షలలో నష్టాన్ని తీసుకువచ్చాయి. దీన్ని బట్టి చూస్తే మిగిలిన సినిమాల కన్నా అఖండ హిట్ కొట్టిందని డిస్ట్రిబ్యూటర్ లో తెలియజేస్తున్నారు.