Anchor Suma Son: మొదటి సినిమా రాకనే రెండో సినిమాకి గ్రీన్ సిగ్నల్.. సుమ కొడుకు రోషన్ స్పీడ్ మామూలుగా లేదుగా!
Anchor Suma Son: బుల్లితెర యాంకర్ గా ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న యాంకర్ సుమ తన సొంత నిర్మాణంలో తన కొడుకును హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేయాలని ఎంతగానో తపిస్తున్నారు.ఈ క్రమంలోనే రోషన్ హీరోగా సినిమా రాబోతోందని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.ఇప్పటికే మొదటి సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలు జరుపుకున్నప్పటికీ ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఇవ్వలేదు.
ప్రస్తుతం రోషన్ ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి అమెరికా నుంచి ఇండియాకి వచ్చిన తర్వాత హీరోగా తనను తాను సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక తన కొడుకుని హీరోగా తెరపై చూడాలన్న ఆత్రుతతో కనకాల దంపతులు కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే సుమ తన సొంత నిర్మాణ సంస్థలో విజయ అనే కొత్త దర్శకుడితో రోషన్ మొదటి సినిమా ప్రకటించారు.
ఈ సినిమా పరంగా పూజా కార్యక్రమాలను ప్రారంభించినప్పటికీ సినిమా షూటింగ్ మాత్రం మొదలు కాలేదు. ఇలా మొదటి సినిమా షూటింగ్ పూర్తి కాకుండా, విడుదల కాకుండానే రోషన్ మరొక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాలీవుడ్ టాక్.
రోషన్ హీరోగా తన రెండవ సినిమాకు టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ విరించి వర్మ దర్శకత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కబోతున్న ఈ సినిమాకి మరో టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కథను సిద్ధం చేశారని తెలుస్తోంది. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉంది తెలియాలంటే అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఏదిఏమైనా సుమ కొడుకు గురించి ఈ వార్తలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొట్టడంతో రోషన్ ఫుల్ స్పీడ్ మీద ఉన్నారంటూ కామెంట్ చేస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…