భూమా నాగిరెడ్డి సతీమణి శోభా నాగిరెడ్డి కారు ప్రమాదంలో మరణించిన తర్వాత వాళ్ల కుటుంబ జాతకమంతా తారుమారైంది. శోభా నాగిరెడ్డి చనిపోయేవరకు వైసీపీలోనే ఉన్నారు. కానీ.. అమ్మ చనిపోయిన తర్వాత భూమా అఖిల ప్రియ రాజకీయాల్లోకి ప్రవేశించారు. తన తండ్రితో కలిసి టీడీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో ఆమె వైసీపీ తరుపున గెలిచి ఆ తర్వాత టీడీపీలో చేరారు. మంత్రి పదవి చేపట్టారు. అంతలోనే తన తండ్రి భూమా నాగిరెడ్డి కూడా మరణించారు. అయినా సరే ఆ తర్వాత ఆమె ఒక్కరే రాజకీయాల్లో చక్రం తిప్పారు. ఇదంతా ఒకప్పటి కధ. ఇక అసలు విషయానికొస్తే..
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ టాలీవుడ్ లో నిర్మాతగా ఎంట్రీ ఇవ్వబోతున్నారని.. అఖిల ప్రియ తన వ్యాపారాల్లో భాగంగానే సినిమా నిర్మాణ రంగంవైపు కూడా శ్రద్ధ చూపుతున్నారని సమాచారం అందింది. ప్రస్తుతం అఖిల ప్రియ టీడీపీలోనే కొనసాగుతున్నారు. కానీ ఆ పార్టీ అధికారంలో లేదు. ఈమధ్యనే భూమా బినామీ ఏవీ సుబ్బారెడ్డితో విబేధాలు చెలరేగిన సందర్భంలో అఖిల ప్రియ పేరు హాట్ టాపిక్ గా మారింది. వీళ్ళిద్దరి మధ్య వివాదాలు తెలుగు రాష్ర్టాల్లో సంచలనం కూడా సృష్టించాయి. ఇదిలావుంటే తాజాగా అఖిల ప్రియ తన భర్త భార్గవ్ రామ్ తో కలిసి సినిమాలు నిర్మించడానికి సిద్దమవుతున్నట్లు టాలీవుడ్ కోడై కూస్తుంది. సినిమా రంగంలో తమకున్న పరిచయాలతో సినీ నిర్మాణం వైపు మొగ్గు చూపుతున్నట్లు తాజా సమాచారం. కాకపోతే ఇందులో ట్విస్ట్ ఏమిటంటే.. అఖిల ప్రియ ప్రత్యక్షంగా పెట్టుబడులు పెడతారా? లేక బినామీలను సినీరంగంలోకి దించుతారా? అన్న విషయం తెలియాల్సి వుంది.
ఇక అఖిలప్రియ తండ్రి భూమా నాగిరెడ్డి మంచి కళా పిపాసి. సినిమాలంటే అమితాసక్తి చూపించేవారన్న సంగతి అందరికీ తెలిసిందే.!. ఆ ఆసక్తితోనే వీర బ్రహ్మేంద్ర క్రియేషన్స్ సంస్థను స్థాపించి గతంలో కొన్ని సినిమాలను కూడా నిర్మించారు. నా కూతురు అనే సినిమాకు తమ్మారెడ్డి భరద్వాజ దర్శకత్వం వహించారు. అలాగే సుమన్ హీరోగా మరికొన్ని సినిమాలను నిర్మించారు. తెలుగు చలనచిత్ర సీమలో అగ్ర హీరోలైన మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణల వంటి సినీ ప్రముఖులతో భూమాకి సత్సంబంధాలున్నాయి. అయితే భూమాకి సినిమాల పట్ల ఉన్న ఆసక్తి కొద్ది సినీ రంగంలో రాణించాలని ప్రయత్నాలు చేసారు. కానీ అనుకున్నంతగా టాలీవుడ్ లో సక్సెస్ కాలేకపోయారు. తాజాగా అఖిల ప్రియ తన తండ్రి ఆశయాన్ని నెరవేర్చడానికే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారని సోషల్ మీడియాలో రూమర్స్ పుట్టుకొస్తున్నాయి. కరోనా మహమ్మారి పుణ్యమా.. అని టాలీవుడ్ లో సినిమా షూటింగ్ లకు ఇప్పుడిప్పుడే అనుమతి లభిస్తున్న ఈ తరుణంలో ఈ రూమర్స్ ఎంత వరకూ కరెక్టో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.!
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…