Bhuvan Gowda : కేజిఎఫ్…. భారతీయ చలనచిత్ర చరిత్రలో ఇది ఒక సంచలన విజయంగా చెప్పుకోవచ్చు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా వచ్చిన కేజిఎఫ్1 సినిమా కి సీక్వెల్ గా కేజీఫ్ 2 వచ్చిన సంగతి తెలిసిందే. కేజీఫ్ 1 కన్నడ చలన చిత్ర పరిశ్రమకు ఘన విజయాన్ని అందిస్తే, కేజీఫ్ 2 దేశ వ్యాప్తంగా అందరి చూపు కన్నడ చిత్ర పరిశ్రమల వైపు చూసేలా చేసింది. ఇప్పటికీ ఈ సినిమా థియేటర్లో కలెక్షన్లను రాబడుతోంది. ఈ సినిమాలో హీరోతో మొదలుకొని ప్రకాష్ రాజ్, సంజయ్ దత్, రవీనా టాండన్ ఇలా ప్రతి ఒక్క నటీనటులు తమ తమ పాత్రలకు జీవం పోశారు. ఈ సినిమాలో కనిపించే వారే కాకుండా తెర వెనుక చిత్ర బృందం లోను ప్రతి ఒక్కరి కృషి ఈ సినిమా విజయానికి తోడ్పడింది. సినిమా ఎడిటింగ్ కెమెరామెన్ పనితనం ఈ సినిమాకి హైలెట్ గా నిలిచింది.
ప్రస్తుతం కేజిఎఫ్ 2 సినిమా కి పని చేసిన కెమెరామెన్ మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సినిమాకు కెమెరా మెన్ అయిన భువన గౌడా పనితనానికి అభిమానుల నుంచి సెలబ్రిటీల వరకు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. కేజిఎఫ్2 ఘన విజయం తర్వాత ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు భువన గౌడ. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కేజీఎఫ్ 3 సినిమాకి నన్ను కెమెరామెన్ గా తీసుకోకపోతే సూసైడ్ చేసుకుంటా….
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న భువన గౌడ కే జి ఎఫ్ 2 సినిమా మేకింగ్ గురించి ప్రశాంత్ నీల్ తో తన అనుబంధం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రశాంత్ నీల్ గారిది నాది సినీ ప్రయాణం ఒకే సినిమా నుంచి మొదలైంది ఉగ్రమ్ సినిమా నుంచి ఇద్దరం కలిసి పని చేశాం.నేను సినిమాటోగ్రఫీ నా మొదటి సినిమా అయిన ఉగ్రం సినిమాలోనే నేర్చుకున్నాను. ప్రశాంత్ నీల్ గారికి నాతో ఎలా పనిచేయించు కోవాలి అని బాగా తెలుసు. కేజిఎఫ్ 3 సినిమా తీస్తారో లేదో నాకు తెలియదు కానీ ఒకవేళ తీస్తే మాత్రం కెమెరామెన్ గా నేనే చేస్తాను ఒకవేళ ప్రశాంత్ గారు నన్ను కాదని వేరే వారిని పెట్టుకుంటే సూసైడ్ చేసుకుంటాను అని చెప్పారు.
కే జి ఎఫ్ 3 సినిమా తీస్తే, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా అంటే కెమెరామెన్ నేనే ఉండాలి, వేరొకరు ఎలా ఉంటారు. మా టీం తో నేను ఉండాలి. కేజిఎఫ్ టీం అంతా ఒక ఫ్యామిలీ లాగా ఉంటాము. అందులో మాకు దర్శకుడు ప్రశాంత్ నీల్ గాడ్ ఫాదర్. ప్రశాంత్ నీల్ గారిది చిన్నపిల్లాడి మనస్తత్వం. ప్రస్తుతం ఈయన చెప్పిన మాటలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.
తూర్పు గోదావరి జిల్లాలో ఓ సాధారణ రైతు తన అచంచల భక్తితో అసాధారణ సృష్టికి రూపమిచ్చాడు. నిత్యజీవితంలో వ్యవసాయం చేస్తూ…
భారతీయ సంస్కృతిలో పలకరింపు అంటే కేవలం మాటల మార్పిడి కాదు.. అది మన విలువలు, వినయం, పరస్పర గౌరవాన్ని ప్రతిబింబించే…
ప్రతిరోజూ ఉదయం లేవగానే స్నానం చేయడం మన దైనందిన జీవితంలో భాగమే. శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడమే కాకుండా, మనసుకు తేలికగా…
వైవాహిక జీవితంలో ఆనందం, ఆయుష్షు, ఐశ్వర్యం కోరుకునే మహిళలు భక్తిశ్రద్ధలతో ఆచరించే వ్రతాలలో వట సావిత్రి వ్రతం ఒకటి. సావిత్రి…
వేసవి కాలం రాగానే మార్కెట్లలో కనిపించే నల్లటి నేరేడు పండ్లు చాలా మందిని ఆకర్షిస్తాయి. రుచికరంగా ఉండే ఈ పండు…
హిందూ పురాణాల్లో సతీదేవి, పరమశివుడు, దక్షుడి యజ్ఞం చుట్టూ తిరిగే కథనం అత్యంత ప్రసిద్ధి చెందినది. ఈ గాథలో దాగి…