Mega Fan open letter : మెగాస్టార్ చిరంజీవి అంటే ఆయన అభిమానులకు ప్రత్యేకమైన ప్రేమ. ఇప్పటికి తన తమ అభిమాన హీరో సినిమా వస్తుంది అంటే ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తాజాగా విడుదలైన మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరు కలిసి నటించిన ఆచార్య సినిమా ఆశించిన విజయం లభించకపోయినప్పటికీ అభిమానులను మాత్రం ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో నెగటివ్ కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఏకంగా మెగాస్టార్ చిరంజీవి పైనే ట్రోల్ చేయడం గమనార్హం.
గతంలో మెగాస్టార్ కు బ్లాక్ బస్టర్ హిట్లు ఇవ్వడం, రికార్డులను క్రియేట్ చేయడం వంటివి కొత్త ఏమి కాదు. ఒక సినిమా ఆశించిన విజయం ఇవ్వకపోతేనే మెగా స్టార్ మీద ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ చేస్తూ ట్రోల్ చేయడాన్ని అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. ఇండస్ట్రీలో ఎవరి సపోర్టు లేకుండా కొణిదెల శివశంకర ప్రసాద్ నుంచి మెగాస్టార్ చిరంజీవి వరకు ఎదగి, ఎందరికో ఆదర్శంగా నిలిచినా అయన గురించి ట్రోల్ల్స్ మెగా అభిమానులను కలచివేస్తున్నాయి.అందుకే తన సినీ ప్రయాణంలో సాధించిన బ్లాక్ బస్టర్ రికార్డులను, ఇండస్ట్రీ హిట్టులను గుర్తు చేస్తూ ఒక అభిమాని మెగా స్టార్ గురించి ఓపెన్ లెటర్ రాసారు. ప్రస్తుతం అది తెగ వైరల్ అవుతోంది.
ట్రోలర్స్ కి కౌంటర్ ఇస్తూ మెగా ఫ్యాన్ ఓపెన్ లెటర్……
మెగాస్టార్ చిరంజీవి అభిమాని ఆయనపై వస్తున్న నెగిటివ్ ట్రోల్స్ కి ధీటు గా ఒక ఓపెన్ లెటర్ రాసాడు. లెటర్ లోని సారాంశం ఏంటంటే.. అప్పట్లోనే ఆపద్బాంధవుడు సినిమాకి రూ.1.25 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుని ఇండియన్ సినిమా చరిత్రలో ఒక్క సినిమాకి ఒక కోటి ఇరవైఅయిదు లక్షల పారితోషకం తీసుకున్న హీరోగా చిరంజీవి రికార్డు సృష్టించారు. అప్పట్లో అమితాబ్ బచ్చన్ ను రెమ్యూనరేషన్ ని దాటేసిన ఆయన గురించి.. ద వీక్ అనే జర్నల్ కవర్ పేజ్ మీద ‘బిగ్గర్ దాన్ బిగ్ బి’ అని చిరంజీవి ఫొటో ముద్రించారు.
1987లో కాలిఫోర్నియాలో ని లాస్ ఎంజెల్స్ లో జరిగిన 59వ ఆస్కార్ అవార్డు ప్రదానోత్సవానికి చిరంజీవి హాజరయ్యారు. అప్పట్లో సౌత్ ఇండియా నుంచి ఆస్కార్ అవార్డ్స్ కు పిలుపు అందుకున్న మొట్ట మొదటి సౌత్ ఇండియన్ హీరో గా చిరంజీవి రికార్డు సృష్టించారు.
భారతీయ సినిమా చరిత్రలో 7 కోట్లు రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్న మొట్టమొదటి నటుడిగా మెగాస్టార్ చిరంజీవి రికార్డు సృష్టించారు.
ఆ సమయంలో అమీర్ ఖాన్ లగాన్ సినిమాకి 6 కోట్ల రూపాయల పారితోషకం తీసుకుని ఆయన తర్వాతి స్థానంలో నిలిచాడు.
టాలీవుడ్ చరిత్రలో బాక్సాఫీస్ వద్ద రూ.10 కోట్లు కలెక్ట్ చేసిన మొట్ట మొదటి సినిమా కూడా మెగాస్టార్ చిరంజీవిదే కావడం విశేషం. 1992వ సంవత్సరం లో విడుదలైన ఘరానా మొగుడు సినిమా రూ.10 కోట్లు వసూళ్లు చేసి రికార్డులు తిరగ రాసింది.
టాలీవుడ్ చరిత్రలో బాక్సాఫీస్ వద్ద రూ.30 కోట్లు కలెక్ట్ చేసిన మొట్ట మొదటి సినిమా కూడా మెగాస్టార్ చిరంజీవిదే. 2002 వ సంవత్సరం లో విడుదలైన ఇంద్ర సినిమా 30 కోట్ల రూపాయలు వసూలు చేసి.. చిరంజీవి బాక్సాఫీస్ కా బాద్ షా అని మరోసారి నిరూపించింది.
ఆయన తీసిన ఖైదీ, పసివాడి ప్రాణం, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, యముడికి మొగుడు, గ్యాంగ్ లీడర్, జగదేక వీరుడు అతిలోక సుందరి, ఘరానా మొగుడు, ఇంద్ర, ఠాగూర్.. ఈ సినిమాలన్నీ ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ హిట్లే. తెలుగు సినిమాలలో అత్యధిక ఇండస్ట్రీ హిట్లు నెలకొల్పిన ఏకైక హీరో కూడా మెగాస్టార్ చిరంజీవి.
మెగాస్టార్ చిరంజీవి ఉత్తమ నటుడిగా ఏడుసార్లు ఫిల్మ్ ఫేర్ అవార్డు, 3 నంది అవార్డులు పొందాడు .
చిరంజీవి కెరీర్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రలలో డైరెక్ట్ వందరోజులు ఆడిన సినిమాలు 47 ఉన్నాయి.
ఇలా చెప్పుకుంటూ పోతే చిరంజీవి సాధించిన రికార్డులు, బ్లాక్ బస్టర్ హిట్లు, ఆయన సెట్ చేసిన బెంచ్ మార్కులు చాలానే ఉన్నాయి. అన్నింటికీ మించి ఆయనకు పడి చచ్చిపోయే కోట్లమంది అభిమానులు వున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికీ ఒప్పుకోకపోయినా.. ఎవరు అంగీకరించకపోయినా టాలీవుడ్ కి ఆయనే పెద్దన్నయ్య అందరికీ తెలుసు. కాబట్టి ఒక్క సినిమాని ప్లాప్ అవ్వడం చూపించి ఆయనను ట్రోల్ చేయడం, కామెంట్ చేయడం కరెక్ట్ కాదు. 9 సంవత్సరాలు సినిమాలకి విరామం ఇచ్చినా.. ఇప్పటికీ ఆయనే ఏకైక టాలీవుడ్ మెగాస్టార్ గా కొనసాగుతున్నారంటే ఆయన క్రేజ్, రేంజ్, స్టామినా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదనే విషయం అర్థమయ్యే ఉంటుంది” అంటూ అభిమాని లెటర్ లో చెప్పుకొచ్చాడు.
తూర్పు గోదావరి జిల్లాలో ఓ సాధారణ రైతు తన అచంచల భక్తితో అసాధారణ సృష్టికి రూపమిచ్చాడు. నిత్యజీవితంలో వ్యవసాయం చేస్తూ…
భారతీయ సంస్కృతిలో పలకరింపు అంటే కేవలం మాటల మార్పిడి కాదు.. అది మన విలువలు, వినయం, పరస్పర గౌరవాన్ని ప్రతిబింబించే…
ప్రతిరోజూ ఉదయం లేవగానే స్నానం చేయడం మన దైనందిన జీవితంలో భాగమే. శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడమే కాకుండా, మనసుకు తేలికగా…
వైవాహిక జీవితంలో ఆనందం, ఆయుష్షు, ఐశ్వర్యం కోరుకునే మహిళలు భక్తిశ్రద్ధలతో ఆచరించే వ్రతాలలో వట సావిత్రి వ్రతం ఒకటి. సావిత్రి…
వేసవి కాలం రాగానే మార్కెట్లలో కనిపించే నల్లటి నేరేడు పండ్లు చాలా మందిని ఆకర్షిస్తాయి. రుచికరంగా ఉండే ఈ పండు…
హిందూ పురాణాల్లో సతీదేవి, పరమశివుడు, దక్షుడి యజ్ఞం చుట్టూ తిరిగే కథనం అత్యంత ప్రసిద్ధి చెందినది. ఈ గాథలో దాగి…