Hyper Aadi -Sudigali Sudheer: ఆ విషయంలో హైపర్ ఆది.. సుధీర్ నిజం చెప్పాల్సిన సమయం వచ్చిందా?
Hyper Aadi -Sudigali Sudheer:జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో హైపర్ ఆది సుడిగాలి సుధీర్ ఒకరు. జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో క్రేజ్ సంపాదించుకొని ప్రస్తుతం కెరియర్ లో బిజీగా ఉన్నారు. అయితే గత కొద్ది వారాల నుంచి హైపర్ ఆది జబర్దస్త్ కార్యక్రమంలో సందడి చేయడం లేదు. ఈ క్రమంలోనే హైపర్ ఆది రాకపోవడానికి కారణం ఏమిటి అనే సందేహం అందరిలోనూ నెలకొంది.
ఇకపోతే మదర్స్ డే సందర్భంగా ఆదివారం శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో భాగంగా హైపర్ ఆది రచ్చ చేశారు. అయితే హైపర్ ఆది ఈ కార్యక్రమం నుంచి తప్పుకోక ముందు ఈ ఎపిసోడ్ షూటింగ్ చేశారని తెలుస్తోంది. ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం బుల్లితెర నటి నటుల మధ్య పెద్దఎత్తున పోటీలు ఏర్పడటం, ఆట పాటలతో అందరినీ ఎంతో సందడి చేశారు.
తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలయింది. ఈ ప్రోమోలో భాగంగా కంటెస్టెంట్ లు వారి అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంది.ఈ క్రమంలోనే అభిమానులు వీడియో ద్వారా పలు ప్రశ్నలు అడుగుతారు. ఆ ప్రశ్నలకు ఇక్కడ ఉన్నటువంటి కమెడియన్స్ సమాధానం చెప్పాలి. ఈ క్రమంలోనే హైపర్ ఆది సుడిగాలి సుదీర్ విషయంలో గత కొద్ది రోజులుగా అందరిలో ఏర్పడిన సందేహాలకు సమాధానం చెప్పే సమయం వచ్చిందని చెప్పవచ్చు.
ఈ సందర్భంగా హైపర్ ఆదిని నెటిజన్లు ప్రశ్నిస్తూ మీరు ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి కేవలం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానిగానే ఉంటున్నారు. కేవలం పవన్ కళ్యాణ్ అభిమానిగా ఉండటం వల్లే మీకు ఇతర సినిమాలలో అవకాశాలు రాలేదా అని ప్రశ్నించారు. అలాగే సుడిగాలి సుదీర్ ప్రశ్నిస్తూ మీరు ఢీ షో లో కనిపిస్తే బాగుంటుంది. కానీ మీరు ఢీ షో నుంచి తప్పుకోవడానికి కారణం ఏమిటి అని మరొక నెటిజన్ ప్రశ్నించారు.మరి ఈ ప్రశ్నలకు హైపర్ ఆది సుడిగాలి సుదీర్ ఏ విధమైనటువంటి సమాధానాలు చెబుతారు అనేది ఆసక్తికరంగా మారింది. మరి ఈ ప్రశ్నలకు వీరిద్దరూ ఎలాంటి సమాధానాలు చెబుతారు అనే విషయం తెలియాలంటే ఆదివారం మధ్యాహ్నం ఈ కార్యక్రమం ప్రసారం అయ్యే వరకు వేచి చూడాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…