Featured

Big Boss Geethu husband Vikas : గీతూతో నా లవ్ స్టోరీ, మొదట ఎవరు ప్రపోజ్ చేశారంటే… నా కళ్ళ ముందే యాక్సిడెంట్… కోమాలోకి వెళ్ళిపోయింది : వికాస్

Big boss Geethu husband Vikas : బిగ్ బాస్ సీజన్ 6 లో కంటెస్టెంట్ గా ఇంట్లో చలాకి గా గేమ్ ఆడుతూ అందరినీ ఎంటర్ టైన్ చేస్తున్న గీతూ రాయల్ మొదట టిక్ టాక్ లో వీడియోస్ చేస్తూ ఆ తరువాత ఇంస్టాగ్రామ్ రీల్స్ తో ఫేమస్ అయి మళ్ళీ బిగ్బాస్ రివ్యూలతో మరింత ఫాలోయింగ్ తెచ్చుకుంది. గలాట గీతూ గురించి ఆమె వ్యక్తిగత జీవితం గురించి ఆమె భర్త వికాస్ రీసెంట్ గా యూట్యూబ్ ఛానెల్ లో ఇంటర్వ్యూలో పంచుకున్నారు. వికాస్, గీతూ ది ప్రేమ వివాహం.

ఎవరు ముందు ప్రపోజ్ చేసారంటే…

చిత్తూరు జిల్లాకు చెందిన గీతూ తన యాసతో బాగా ఫేమస్ అయింది. ఇక చిన్నప్పటి తన స్నేహితుడైన వికాస్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది గీతూ. అయితే ఇద్దరిలో మొదట ఎవరు ప్రపోజ్ చేశారు అనే విషయాలను వికాస్ పంచుకున్నారు. చిన్నప్పుడు వికాస్ వాళ్ళ ఇంటి దగ్గరే గీతూ వాళ్ళు ఉండేవాళ్ళు. అలా ఫ్యామిలీకి పరిచయం ఉండటం, గీతూ వాళ్ళ అన్న వికాస్ కి స్నేహితుడు, అలా వాళ్ళ మధ్య పరిచయం ఏర్పడింది. కానీ అది చాలా చిన్నతనం. ఇక ఆ తరువాత గీతూ వాళ్ళ కుటుంబం నంద్యాల వెళ్లిపోవడంతో ఇరు కుటుంబాలకు కనెక్ట్ పోయింది. ఇక మళ్ళీ కొన్నేళ్ల తరువాత పేస్ బుక్ ద్వారా కనెక్ట్ అయిన వికాస్ గీతూల పరిచయం స్నేహంగా మారింది. బెంగళూరులో గీతూ జాబ్ చేస్తున్న సమయంలో వికాస్ కూడా బెంగళూరులో ఏంబిఏ చదవడానికి అక్కడికి వెళ్లడంతో ఇంకొంచం స్నేహం బలపడింది.

ఇక వికాస్ వాళ్ళ అక్క గీతూ ని డైరెక్టర్ గా వికాస్ ను పెళ్లిచేసుకోవచ్చు కదా అని అడగడం, గీతూ కూడా థింక్ చేసి వాళ్ళ ఇంట్లో చెప్పడం, ఇక వికాస్ కూడా నాకు ఎవరూ సెట్ ఎవ్వరు గీతూ అయితేనే సెట్ అవుతుంది అనుకుని ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. అలా ఇద్దరూ ‘ఐ లవ్ యు’ అంటూ ప్రపోజ్ చేసుకోలేదని వికాస్ చెప్పారు. ఇక బెంగళూరు లో సరదాగా రన్నింగ్ బస్ లో నుండి దిగితే ఎలా ఉంటుంది అని చూడాలనుకుని గీతూ రన్నింగ్ బస్ లో నుండి దిగింది. అలా తలకి గాయం తగిలి కొన్ని గంటలు కోమా లోకి వెళ్ళిపోయిందట. ఆ సమయంలో గీతూ తోనే ఉన్న వికాస్, చాలా భయపడ్డాను ఇక గీతూ ఉండదేమో ఇలాంటి ఆలోచనలతో ఏడుస్తూ ఉండిపోయాను అంటూ ఎమోషనల్ అయ్యారు. ఇక గీతూ తలకి దాదాపు 14 కుట్లు పడటంతో కోలుకున్న తరువాత కూడా కొన్ని రోజులు కొన్ని విషయాలను మర్చిపోతూ ఉండేది అంటూ వికాస్ చెప్పారు. బిగ్ బాస్ లో గీతూ ఆట చాలా బాగుంది, టాప్ 5 లో ఖచ్చితంగా ఉంటుంది అంటూ చెప్పారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 weeks ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 weeks ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 weeks ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 weeks ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 weeks ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

4 weeks ago