Pruthvi : సినిమాలతో మొదలు పెట్టి సీరియల్స్ లోకి వెళ్లి తమిళ సీరియల్స్ తో బాగా ఫేమస్ అయిన పృథ్వీ తెలుగులో మాత్రం పెళ్లి పృథ్వీగా బాగా ఫేమస్ అయ్యాడు. ‘పెళ్లి’ సినిమా కంటే ముందే పృథ్వీ తెలుగులో సినిమాలు చేసినా పెళ్లి సినిమాతో వచ్చిన ఫేమ్ వల్ల పెళ్లి పృథ్వీగా పేరు తెచ్చుకున్నాడు. ఇక ఆ తరువాత అడపాదడపా సినిమాలు చేసినా మళ్ళీ సమర సింహ రెడ్డి, మన్మధుడు, చెన్నకేశవ రెడ్డి వంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. హీరోగానే నటించాలనే నియమేమి పెట్టుకోకుండా ఇతర హీరోల సినిమాలలో కూడా నటించాడు పృథ్వీ. ఇక మొదట్లో సినిమా అవకాశాల కోసం కష్టపడుతున్న సమయంలో రఘువరన్ మంచి స్నేహితుడు అంటూ చెప్పారు పృథ్వీ.
మీనాతో ఆ సినిమాలో నేను నటించాల్సింది…
సినిమా పరిశ్రమలో కష్టపడి పైకి వచ్చిన వారిలో పృథ్వీ ఒకరు, ఆయన ఇన్నేళ్ల సినీ జీవితంలో అన్నింటినీ చూసారు. మొదట్లో ఎదుర్కొన్న ఇబ్బందులు అన్నిటినీ షేర్ చేసుకున్నారు. క్రాంతి కుమార్ డైరెక్షన్ లో మీనా తొలి చిత్రంగా వచ్చిన ‘సీతారామయ్య గారి మనవరాలు’ సినిమాలో పాత్రకు పృథ్వీ ని ఎంచుకున్నారు. అయితే సినిమా ఆడిషన్ సమయంలో గడ్డంతో ఉన్న పృథ్వీ ని క్రాంతి కుమార్ గారు ఓకే చేసారు. అయితే ఆ తరువాత కొద్ది రోజులకు ప్రారంభం పూజ కార్యక్రమంతో షూటింగ్ స్టార్ట్ చేయాల్సి ఉండగా పృథ్వీ గారు క్లీన్ షేవ్ చేసుకుని వస్తే డైరెక్టర్ క్రాంతి కుమార్ గారు పృథ్వీ ని చూసి చాలా సీరియస్ గా తిట్టాడట, ఎందుకని అడిగితే గడ్డం ఎందుకు తీసేసావ్ అని కోపంగా అన్నారట.
మీరు చెప్పలేదు కదా గడ్డం తో ఉండమని అని అడిగితే చెప్పాకదా గడ్డం బాగుందని అని సీరియస్ గా తిట్టి పంపించేశారట. మళ్ళీ వారం తరువాత గడ్డం పెంచి ఆయనకు కనిపించినా వద్దని పంపించేశారు, కాళ్ళు పట్టుకుని బ్రతిమాలినా ఆయన వినలేదు. నా గడ్డం వల్ల కూడా అవకాశం పోతుందని అనుకోలేదు అంటూ పృథ్వీ గారు తనకు జరిగిన ఇన్సిడెంట్స్ ను చెప్పారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…