Big Boss season 6 : బిగ్ బాస్ రియాలిటీ షో అన్ని భాషలలోనూ మంచి హిట్. ఇంగ్లీష్ నుండి దిగుమతి చేసుకున్న ఈ షో ఇండియా లోనూ మంచి ప్రేక్షకాధరణ పొందింది. తెలుగులో కూడా ఐదు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇక ఇప్పుడు ఆరో సీజన్ కూడా మొదలయింది. అయితే జనాలు షో సరిగా చూడటం లేదు. దీనికి నిదర్శనం పడిపోయిన రేటింగ్స్. బిగ్ బాస్ అన్ని సీజన్లలో ఈ సీజన్ రేటింగ్స్ దారుణంగా ఉన్నాయి. విమర్శలు కాంట్రావర్సీలకు కేర్ ఆఫ్ అయిన బిగ్ బాస్ ను తిడుతూనే చూసే జనం చాలా మందే ఉన్నారు. అందుకే ఎన్ని విమర్శలు వచ్చినా షో రేటింగ్స్ కి డోకా లేకుండా ఉంది ఇప్పటి వరకు, అయితే ఇప్పుడు మాత్రం అలా లేదు పరిస్థితి.
మొత్తం తెలుగు బిగ్ బాస్ సీజన్స్ లో తక్కువ రేటింగ్…
ఈసారి సీజన్లో లాంచింగ్ ఎపిసోడ్ కి 6 రేటింగ్ రావడంతో బిగ్ బాస్ యాజమాన్యం ఖంగుతినింది. ప్రతి సారి 15 కి తగ్గకుండా రేటింగ్ తో దూసుకుపోయే బిగ్ బాస్ ఈ సారి చతికిల పడటానికి ముఖ్య కారణం అదే రోజున ఆసియా కప్ కోసం భారత్ పాకిస్థాన్ మ్యాచ్ ఉండటం. ఇది బిగ్ బాస్ రేటింగ్స్ కు బాగా దెబ్బేసింది. ఇక దీని రువాత ఓటీటీ లో బిగ్ బాస్ నాన్ స్టాప్ అంటూ ప్రసారం అవ్వడం వల్ల ప్రేక్షకులు ఆసక్తిని కోల్పోతున్నారు. చూడాలని అనుకునే వారు ఫోన్లో చూసేస్తున్నారు. ఇక ఈ సారి కాంటెస్టెంట్లు కూడా బిగ్ బాస్ కి మైనస్సే. ఒక నలుగురైదుగురు తప్పితే మిగిలిన వాళ్ళు ఎవరో కూడా ఎవరికీ తెలియదు.
ఇక ఎపిసోడ్స్ లో ఏదైనా కొత్తదనం ఉందా అంటే అదే రొటీన్ టాస్కులు, గొడవలు, దీనితో చూసేవారికి బోర్ కొడుతోంది. ముందు సీజన్స్ లో ఉన్న రేటింగ్స్ తో చూస్తే బిగ్ బాస్ ఈ సీజన్లో రేటింగ్స్ చాలా దారుణంగా ఉన్నాయి. మొదటి సీజన్ కి 16.18, ఇక రెండో సీజన్ 15.05 అని హోస్టింగ్ కి ఉండగా, ఇక మూడో సీజన్ నుండి నాగ్ అధరగొట్టాడు ఏకంగా 17.09 రేటింగ్ తో సాలిడ్ షో గా నిలిచింది. ఇక నాలాగో సీజన్ 18.05 ఉండగా, ఐదో సీజన్ 15.71 తో పర్వాలేదనిపించింది. ఇక ఈ సీజన్ చూస్తే 8.8 రేటింగ్ తో దారుణంగా ఉంది. ఇక దీనిపై నెటింట్లో ట్రోల్స్, మిమ్స్ ఎక్కువయ్యాయి. ఇలానే రేటింగ్స్ ఉంటే బిగ్ బాస్ దుకాణం ఎత్తేయాల్సిందే అనే టాక్ వినిపిస్తోంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…