బిగ్ బాస్ రియాల్టీ షోకి సినీ ప్రముఖులు మద్దతు ఎక్కువగా ఉంటుంది. అందులో ఏదో ఒక కంటెస్టెంట్ కు మద్దతు ఇస్తుంటారు. వాళ్లకు సపోర్టు చేస్తూ పోస్టులు.. వీడియోలు చేస్తుంటారు. ఇలా బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో కూడా అవినాష్ కు జబర్దస్త్ టీం మొత్తం పెద్ద సపోర్టుగా నిలిచారు. రామ్ గోపాల్ వర్మ్ అయితే అరియానాకు సపోర్టు చేసిన విషయం తెలిసిందే.
వాళ్లు సోషల్ మీడియాలో వాళ్ల కోసం చేసిన ప్రచారం మామూలుగా లేదు. ప్రతీ ఒక్కరు వాళ్లు అనుకున్న కంటెస్టెంట్ కు సపోర్టుగా నిలవాలని కోరారు. అయితే ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ ఫైవ్ రన్ అవుతోంది. అందులోకి 19 మంది ఎంట్రీ ఇచ్చారు. అందులో కొంతమంది చాలామందికి తెలియదు.
మరికొంత మంది యాంకర్లుగా, డ్యాన్సర్ గా, టీవీ సీరియల్ ల్లో నటించిన వారు ఉన్నారు. మిగతావారు దేనిలో ఒకదాంట్లో ప్రావీణ్యం ఉన్నా అంతగా పాపులారిటీ లేని వాళ్లు ఉన్నారు. అయితే అందులో జబర్దస్త్ నుంచి ట్రాన్స్ జెండర్ ప్రియాంక్ సింగ్ కూడా ఉన్నారు. ఆమెకు తన సపోర్టు ఎక్కువగా ఇస్తున్నట్లు ఒకప్పుడు జబర్దస్త్ కు జడ్జిగా వ్యాహరించిన నాగబాబు చెప్పుకొచ్చారు.
తన పూర్తి మద్దతు ప్రియాంకకే ఉంటుందన్నారు. ప్రియాంక అబ్బాయిగా (సాయి తేజ) ఉన్నప్పుడే తనకు బాగా క్లోజ్ అని, ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చారన్నారు. ప్రియాంక సింగ్ టైటిల్ గెలుస్తారా.. లేదా అనేది తెలియదు కానీ.. తన మద్దతు మాత్రం ఆమెకు ఉంటుందని చెప్పారు. ఆమె కష్టాల్లో ఉన్న సమయంలో ఓ కామెడీ షోలో ఛాన్స్ ఇచ్చినట్లు చెప్పారు. ఆమెది శ్రీకాకులం జిల్లాగా చెప్పుకొచ్చారు. దయచేసి ఆమెకు సపోర్టుగా నిలవాలని నాగబాబు కోరారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…