తాజాగా బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్సీ పోటీ దారుల టాస్క్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సన్నీని బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచి అతడికి స్పెషల్ పవర్ ఇచ్చి, ఒకరి నుంచి సగం బంగారు ముత్యాలను తీసుకుని మరొకరికి ఇవ్వమని చెప్పాడు. దీనితో సన్నీ సిరి దగ్గరనుంచి గోల్డ్ ను షణ్ముఖ్ కి ఇచ్చాడు. ఫస్ట్ రౌండ్ లో ఎక్కువ బంగారం సంపాదించిన పింకీ,మానస్ లకు బెలూన్ టాస్క్ ఇవ్వగా అందులో పింకీ గెలిచింది.
ఇక సిరి ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అయ్యాము అందుకే ట్రిప్ అవుతున్నాడని తెలిపింది. అప్పుడు రవి మీరిద్దరూ ఒకరినొకరు బాగా సీరియస్ గా తీసుకుంటున్నారు అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇదే విషయంలో అతడు ఎందుకంత ట్రిప్ అవుతున్నాడు? నీ విషయంలో ఎందుకు ట్రిప్ అవుతున్నాడు ఒక్కసారి ఆలోచించు అంటూ హితవు పలికాడు రవి.
అనంతరం శ్రీ రామచంద్రకు ఒక పవర్ వచ్చినప్పటికీ అది అతనికి అనుకూలంగా రాలేదు. 30 బంగారు ముత్యాలను ఇవ్వాలని బిగ్ బాస్ ఆదేశించగా, తన వద్ద ఒక్క ముత్యం కూడా లేకపోవడంతో పథకం రచించిన శ్రీరామ్ తనకు ఒక పవర్ వచ్చింది అంటూ రవి ముత్యాలను సొంతం చేసుకున్నాడు. అంతా అయిపోయిన తరువాత చివర్ లో స్పెషల్ పవర్ నాకు రాలేదంటూ బాంబు పేల్చాడు.
ఈ టాస్క్ లో రెండవ రౌండ్ లో సిరి సన్నీ బంగారం వెతుకులాటలో టాప్ లో ఉండగా వీరిలో ఒకరు కెప్టెన్సీ కండెన్సర్ అయ్యే అవకాశాన్ని కల్పించాడు బిగ్ బాస్. సిరి తరఫున వేరొకరు చాలెంజ్ లో పాల్గొనాలంటూ ట్విస్ట్ ఇవ్వగా, దీనితో సిరి తరపున మానస్ పోటీ పడతారని చెప్పింది. సన్నీని ఓడించేందుకు రంగంలోకి దిగాడు మానస్. ఇందులో మానస్ గెలిచి సిరిని కెప్టెన్సీ కండెన్సర్ ను చేశాడు. ఈ గేమ్ నిబంధన గురించి తనకు ముందే సరిగా చెప్పలేదు అంటూ సంచాలకుడు అయిన రవి పై ఆగ్రహం వ్యక్తం చేశారు సన్నీ. ఇక తన కోపాన్ని తగ్గించుకునేందుకు సన్నీ స్విమ్మింగ్ పూల్ లో దూకాడు.
Cheating Wife : వివాహ బంధం పవిత్రమని భావించే సమాజంలో అక్రమ సంబంధాల కారణంగా జరుగుతున్న ఘటనలు తరచూ సంచలనం…
హైదరాబాద్‌లోని అత్తాపూర్ ప్రాంతంలో ప్రముఖ స్వీట్ షాప్‌పై ఆహార భద్రతకు సంబంధించిన ఆరోపణలు సంచలనం రేపాయి. పేరుగాంచిన బ్రాండ్‌గా గుర్తింపు…
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 నిబంధనలు పాటించాల్సి ఉంటుందంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో నెట్టింట వైరల్ అయిన…
తెలుగు సినీ ప్రపంచాన్ని ఒకప్పుడు కుదిపేసిన హీరోయిన్ ప్రత్యూష మృతి కేసులో ఎట్టకేలకు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. దాదాపు…
ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలకు…
అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అంథ్రోపిక్ (Anthropic) భారత్‌లోకి అధికారికంగా ప్రవేశిస్తోంది. సోమవారం సంస్థ విడుదల చేసిన…