Movie News

బిగ్ బాస్ లో అనాగరిక చర్యలు.. నాగర్జునపై 100 కోట్ల జరిమానా వేయిస్తా : నటి మాధవీ లత

సీనియర్ నటి మాధవి లత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈమె నిత్యం ఏదో ఒక విషయంపై స్పందిస్తూ తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తాజాగా ఈమె బిగ్ బాస్ షో పై సంచలన వ్యాఖ్యలు చేసింది. బిగ్ బాస్ ప్రస్తుత పరిస్థితులపై, బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున పై కూడా సోషల్ మీడియా వేదికగా మండిపడింది. బిగ్ బాస్ లో అనాగరిక చర్యలు జరుగుతున్నాయని, ఒక మనిషి సూసైడ్ చేసుకుని స్థాయిలో బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున అవమానించారు అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఇలాంటి వాటిపట్ల మానవ హక్కులు, ప్రజా సంఘాలు స్పందించవు అంటూ ఏకి పారేసింది. ఒకవేళ అదే పని నాగార్జున చేస్తే ఎలా ఉంటుంది? మరుసటిరోజు నూరు శాతం గాయబ్ అవుతాడు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అప్పట్లో అయితే ఇలాంటి వాటికి శిక్షలు ఉండేవి. తప్పు చేసిన వారికి సగం గుండు, అర మీసం కొట్టించి సున్నం బొట్టుపెట్టి గాడిద మీద ఊరేగించి వారు. ఈ సమయంలోనే సున్నిత మనస్తత్వం కలిగిన వ్యక్తులు అవమానభారంతో ఆత్మహత్యలు చేసుకునే వారు. ఇలాంటి కఠిన విష సంస్కృతి వద్దు అని మనుషులం మనం మృగాళ్లలా ఉండదు అని మనల్ని మనం మార్చుకుంటూ వచ్చాం.

కానీ బిగ్ బాస్ లో ఇప్పటికీ అలాంటి విషపు ఆలోచనలు ఉన్న వారిని తీసుకోవడం, సైకో అలాంటి మనస్తత్వం ఉన్నవారికి రచన అవకాశం ఇవ్వడం అనేది ఇంతటి దుర్మార్గం అంటూ ఆమె మండిపడింది. ఇలాంటి అనాగరికపు చర్యలకు దిగజారుతున్న టీవీ షో కూడా పట్టించుకోకుండా ప్రజలు వదిలేస్తున్నారు. మినిస్టర్ మీద నాకు గనుక పగ్గాలు వస్తే ఇలాంటి షోనీ పద్ధతి లేకుండా అనాగరిక వ్యవస్థకి పట్టం పడుతున్న యాజమాన్యం మరియు హోస్ట్ కి నూరు కోట్ల జరిమానా వేయిస్తాను అని ఆమె తెలిపింది.

ప్రజలు మర్చిపోయినా అనాగరిక పద్ధతులను భారతదేశం అంతటా బ్యాన్ చేయాలి. అంతేకాకుండా ఇది చూస్తూ నోరు మూసుకున్న సామాజిక కార్యకర్తలు అలాగే టీవీ ఛానల్ స్పందించాలి. ఇటీవలే సమంత విడాకుల విషయం గురించి ఒక ప్రపంచ వింతల టెలికాస్ట్ చేసిన ఛానల్, అలాగే రెచ్చిపోయిన విలేకరులు ఇలాంటి సభ్యసమాజం అసహ్యించుకునే అనాగరిక చర్యలపై మాట్లాడరా? అందుకు ధైర్యం లేదా? లేక భయమా? లేకపోతే మాకెందుకు అని నిర్లక్ష్యంగా అంటూ ఆమె ప్రశ్నించింది. ఇది ఇలాగే కొనసాగితే న్యాయస్థానం ద్వారా మీ చర్యలకు అడ్డుకట్ట వేయించేలా చేస్తాను అంటూ ఆమె బిగ్ బాస్ షో పై తీవ్రస్థాయిలో మండిపడింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సినిమా కోసం కఠిన నియమాలు.. కృతి సనన్ ఫిట్‌నెస్ సీక్రెట్ బయటపెట్టింది

సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…

1 hour ago

పవన్ కల్యాణ్ కోసం కొండగట్టులో పూజలు.. అభిమానుల ఆరాటం వైరల్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…

1 hour ago

ట్రంప్‌తో టీ తాగించిన తరుణ్ భాస్కర్.. వీడియో వైరల్!

టాలీవుడ్‌లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్‌తో వార్తల్లో నిలిచారు. కొత్త…

2 hours ago

బాణాసంచా తయారీ కేంద్రంలో విషాదం.. కేంద్రం అలర్ట్

కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…

2 hours ago

సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలి షాకింగ్ పని.. టెర్రస్‌పై గంజాయి!

హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…

2 hours ago

ఆయన నమ్మకమే నా కెరీర్ మలుపు.. అజయ్ ఘోష్ ఎమోషనల్..!

తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…

2 hours ago