కొన్ని సంవత్సరాల క్రితం తెలుగులోనే కాదు.. దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా వెలుగు వెలిగిన నటి ఇలియానా. అయితే ఆ తర్వాత క్రమంగా ఈ భామకు అవకాశాలు కరువు అయ్యాయి. వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో రూపొందిన దేవదాసు అనే సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన నటి ఇలియానా.. కొంతకాలంలోనే తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది.
తెలుగుతో పాటు తమిళంలోనూ స్టార్ హీరోలతో నటించి ఫుల్ బిజీ అయిపోయింది. ఇక బాలీవుడ్ లో కూడా బర్ఫీ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. అక్కడ కూడా ఈ భామ నటనకు మంచి గుర్తింపు వచ్చింది. అయితే పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవు. బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇలియానాకు క్రమంగా అవకాశాలు తగ్గిపోతూ వచ్చాయి.
ఇదిలా ఉండగా ఆమె ప్రస్తుతం ఫిట్ నెస్ పై వర్కౌట్ చేస్తున్నారు. వర్కవుట్లతో ఇలియానా బిజీగా ఉంటుంది. తాజాగా ఆమె జిమ్ లో చేసే వర్కవుట్ల గురించి.. ట్రైనర్ గురించి చెబుతూ.. కన్నీరు పెట్టుకున్నారు. ఇలాంటిది తన జీవితంలో ఎప్పుడూ జరగలేదని చెప్పుకొచ్చింది. ట్రైనర్ ఇలా అన్నాడు. నీ చేతులను నీ దగ్గర పెట్టుకొని.. నీ బాడీ గురించి నువ్ ఆలోచించుకో… నీ కోసమే నీ శరీరం ఎంత కష్టపడుతుందో ఆలోచించు..అని ట్రైనర్ చెప్పగానే నిజమే కదా అని అనిపించినట్లు చెప్పింది.
అతడు చెప్పిన విధంగా చేసిన తర్వాత తనకు ఎంతో సంతోషం వేసిందని.. మీరుకూడా ఒక్కసారి అలా చేసుకోండి అంటూ చెప్పుకొచ్చింది. . ఒకప్పుడు బిజీ హీరోయిన్‌గా ఉన్న ఆమె.. మళ్లీ అలాగే మారాలని ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటివరకూ కేవలం కమర్షియల్ సినిమాలు మాత్రమే చేసిన ఆమె.. తన కెరీర్‌లో తొలిసారిగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసేందుకు రెడీ అవుతోందంటూ టాక్ వినిపిస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…