Categories: FeaturedMovie News

సిరి, షన్ను వ్యవహారం సీరియస్ అవుతుందంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన రవి..!

తాజాగా బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్సీ పోటీ దారుల టాస్క్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సన్నీని బిగ్ బాస్ క‌న్ఫెష‌న్ రూమ్ లోకి పిలిచి అతడికి స్పెషల్ పవర్ ఇచ్చి, ఒకరి నుంచి సగం బంగారు ముత్యాలను తీసుకుని మరొకరికి ఇవ్వమని చెప్పాడు. దీనితో సన్నీ సిరి దగ్గరనుంచి గోల్డ్ ను షణ్ముఖ్ కి ఇచ్చాడు. ఫస్ట్ రౌండ్ లో ఎక్కువ బంగారం సంపాదించిన పింకీ,మానస్ లకు బెలూన్ టాస్క్ ఇవ్వగా అందులో పింకీ గెలిచింది.

ఇక సిరి ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అయ్యాము అందుకే ట్రిప్ అవుతున్నాడని తెలిపింది. అప్పుడు రవి మీరిద్దరూ ఒకరినొకరు బాగా సీరియస్ గా తీసుకుంటున్నారు అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇదే విషయంలో అతడు ఎందుకంత ట్రిప్ అవుతున్నాడు? నీ విషయంలో ఎందుకు ట్రిప్ అవుతున్నాడు ఒక్కసారి ఆలోచించు అంటూ హితవు పలికాడు రవి.

అనంతరం శ్రీ రామచంద్రకు ఒక పవర్ వచ్చినప్పటికీ అది అతనికి అనుకూలంగా రాలేదు. 30 బంగారు ముత్యాలను ఇవ్వాలని బిగ్ బాస్ ఆదేశించగా, తన వద్ద ఒక్క ముత్యం కూడా లేకపోవడంతో పథకం రచించిన శ్రీరామ్ తనకు ఒక పవర్ వచ్చింది అంటూ రవి ముత్యాలను సొంతం చేసుకున్నాడు. అంతా అయిపోయిన తరువాత చివర్ లో స్పెషల్ పవర్ నాకు రాలేదంటూ బాంబు పేల్చాడు.

ఈ టాస్క్ లో రెండవ రౌండ్ లో సిరి సన్నీ బంగారం వెతుకులాటలో టాప్ లో ఉండగా వీరిలో ఒకరు కెప్టెన్సీ కండెన్సర్ అయ్యే అవకాశాన్ని కల్పించాడు బిగ్ బాస్. సిరి తరఫున వేరొకరు చాలెంజ్ లో పాల్గొనాలంటూ ట్విస్ట్ ఇవ్వగా, దీనితో సిరి తరపున మానస్ పోటీ పడతారని చెప్పింది. సన్నీని ఓడించేందుకు రంగంలోకి దిగాడు మానస్. ఇందులో మానస్ గెలిచి సిరిని కెప్టెన్సీ కండెన్సర్ ను చేశాడు. ఈ గేమ్ నిబంధన గురించి తనకు ముందే సరిగా చెప్పలేదు అంటూ సంచాలకుడు అయిన రవి పై ఆగ్రహం వ్యక్తం చేశారు సన్నీ. ఇక తన కోపాన్ని తగ్గించుకునేందుకు సన్నీ స్విమ్మింగ్ పూల్ లో దూకాడు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 weeks ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 weeks ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 weeks ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 weeks ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 weeks ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

4 weeks ago