టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. తన తండ్రి చిరంజీవితో కలిసి ఆచార్య సినిమాలో నటించిన విషయం తెలిసిందే. అలాగే జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి ఆర్ఆర్ఆర్ సినిమాలో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. చెర్రీ తన ప్రతి ఒక్క సినిమాలో తన డిఫరెంట్ లుక్స్ తో అలరిస్తూ ఉంటారు. సార్ హీరోగా ఉన్న రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.
ప్రస్తుతం టాలీవుడ్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో RC 15 సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో రామ్ చరణ్ చాలా స్టైలిష్ లుక్ లో కనిపించనున్నారు. ఇందుకోసం రామ్ చరణ్ ప్రత్యేకంగా ముంబై నుంచి ఒక ప్రత్యేక టీమ్ ను నియమించుకున్నారట. రామ్ చరణ్ హెయిర్ స్టైలిస్ట్ కు మాత్రమే ప్రొడక్షన్ టీమ్ ఒక్క రోజుకి దాదాపుగా 1.5నుంచి 2 లక్షల రూపాయలు చెల్లిస్తున్నారట.
ఈ స్టైలిస్ట్ కు తోడుగా మరో ముగ్గురు అసిస్టెంట్ కూడా ఉన్నారు.షూటింగ్ ఉన్న ప్రతిసారీ వీరికి బిజినెస్ క్లాస్ టికెట్ తో పాటుగా,స్టార్ హోటల్ ను బుక్ చేస్తారట. అలా షూటింగ్ పూర్తయ్యే సరికి కేవలం రామ్ చరణ్ హెయిర్ స్టైలిస్ట్ కు మాత్రమే దాదాపు కోటి రూపాయల వరకు అవుతుందట. మరి పాన్ ఇండియా సినిమా అంటే ఆ మాత్రం ఉండాల్సిందే మరి.
ప్రస్తుతం రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుని, పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 7న తెలుగుతోపాటు, తమిళం,హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు. ఇక రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి స్టెప్పులు వేసిన నాటు నాటు సాంగ్ కు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన వస్తోంది. ఎక్కడ చూసినా కూడా ఈ పాట మార్మోగిపోతోంది.
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…
వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…
తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…
తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన ప్రయాణం చేసిన నటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, సంగీతంపై…
లోక్‌సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ధార్మిక అంశం చర్చకు దారితీసింది. జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఇటీవల శ్రీరాముడిపై చేసిన…