బిగ్ బాస్ హౌస్ లో బంగారు కోడిపెట్ట టాస్క్ లో భాగంగా కంటెస్టెంట్ ల మధ్య గొడవలు తారా స్థాయికి చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే బంగారు కోడిపెట్ట టాస్క్ లో భాగంగా గుడ్లను కలెక్ట్ చేసే టాస్క్ లో భాగంగా కంటెస్టెంట్స్ సన్నీ, ప్రియాకు మధ్య యుద్ధం మొదలైంది. సన్నీ సంపాదించిన కోడిగుడ్లను ప్రియా దొంగతనం చేస్తానని శపథం చేసింది.
ఈ క్రమంలోనే సన్నీ బుట్టలో ఉన్నటువంటి కోడిగుడ్లను దొంగతనం చేయడానికి ప్రియా ప్రయత్నిస్తున్న సమయంలో సన్నీ తనని పక్కకు తోస్తాడు. ఈ సమయంలోనే ప్రియ తనపై ఫిజికల్ అటాక్ చేస్తున్నారంటూ మాట్లాడటంతో సన్నీ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని చెబుతాడు.
దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రియా సన్నీకి వేలు చూపెడితే చెంప పగులుతుంది అని వార్నింగ్ ఇస్తుంది. ఇలా ప్రియా మాట్లాడటంతో సన్నీ సీరియస్ అవుతూ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా ఇలా ఆడడానికి చేతకాని వాళ్ళు ఇక్కడికి ఎందుకు వస్తారో ఏంటో అంటూ సీరియస్ అవుతాడు.
ఇలా ప్రియా పిచ్చి పట్టిన దాని మాదిరి మాటిమాటికి సన్నిని చెంప పగులుతుంది అనడంతో అందుకు దమ్ముంటే కొట్టి చూడు అంటూ ఆమెకు సవాల్ విసిరాడు. ఇక బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో భాగంగా జెస్సికు బిగ్ బాస్ ఒక ఆఫర్ ప్రకటించాడు.తాను ఎవరికీ తెలియకుండా ముగ్గురి గుడ్లను దొంగతనం చేస్తే తాను నేరుగా కెప్టెన్ అయ్యే అవకాశాన్ని కల్పించాడు. ఇందులో భాగంగా తను ఎవరి సహాయం అయినా తీసుకోవచ్చు అని చెప్పడంతో సిరి సహాయం తీసుకుని దొంగతనం చేయగా సిరి, జెస్సీలతో కూడా సన్నీకి గొడవ జరుగుతుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…