Bigg Boss6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ కార్యక్రమం చివరి దశకు చేరుకుంది. మరోరెండు రోజులలో ఈ కార్యక్రమం పూర్తి కానుంది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ విన్నర్ ఎవరు అనే విషయం గురించి ఆత్రుత నెలకొంది. ఇకపోతే ప్రస్తుతం హౌస్ లో ఆరుగురు కంటెస్టెంట్ లో ఉండడం వల్ల మిడ్ వీక్ ఎలిమినేషన్ జరుగుతుందని నాగార్జున ప్రేక్షకులకు చెప్పారు కానీ హౌస్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్లకు మాత్రం ఈ విషయం తెలియదు.
ఈ క్రమంలోనే అర్ధరాత్రి సమయంలో అందరూ గాఢ నిద్రలో ఉండగా బిగ్ బాస్ బజర్ మోగించి అందరిని నిద్ర లేపారు. ఇలా బజార్ మోగడంతో ఏం జరిగిందో తెలియక హౌస్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్ లో ఒక్కసారిగా ఆందోళన చెందారు.బిగ్ బాస్ వెంటనే హౌస్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్లు అందరిని లగేజ్ సర్దుకొమ్మని చెప్పడంతో ఏం జరిగిందోనని అందరూ ఆందోళన చెందారు.
ఈ క్రమంలోనే బిగ్ బాస్ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉందని చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు.ఈ క్రమంలోనే మిడ్ వీక్ ఎలిమినేట్ కావాల్సిన కంటెస్టెంట్ ను అక్కడున్నటువంటి వాళ్లే సెలెక్ట్ చేయాలని చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు.ఇలా ఒకరి పేరు ఒకరు చెప్పుకుంటూ నామినిట్ చేసుకున్నారు. అయితే ఎక్కువగా కీర్తి పేరు ఉండడంతో ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ గా కీర్తి ఎలిమినేట్ కావాల్సి ఉంది.
ఇకపోతే బిగ్ బాస్ మాత్రం ప్రేక్షకులు వేసిన ఓట్లు ఆధారంగా మిడ్ వీక్ ఎలిమినేషన్ జరుగుతుందని చెప్పారు.ఇలా మిడ్ వీక్ ఎలిమినేషన్ జరుగుతుందని తెలియడంతో కంటెస్టెంట్లలో కాస్త కంగారు నెలకొంది అయితే అందుతున్న సమాచారం ప్రకారం మిడ్ వీక్ ఎలిమినేషన్ లో భాగంగా శ్రీ సత్య ఎలిమినేట్ అవుతారునీ తెలుస్తోంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…