కరోనా మహమ్మారి రోజురోజుకూ తన ప్రతాపాన్ని చూపిస్తుంది. ఈ వైరస్ సామాన్య ప్రజలనే కాకుండా బాలీవుడ్, టాలీవుడ్, టీవీ రంగ ప్రముఖులను కూడా వణికిస్తోంది. గత 15 రోజుల నుండి ప్రభుత్వ అనుమతులతో టీవీ సీరియల్ షూటింగ్స్ మళ్ళీ మొదలైన సంగతి తెలిసిందే. దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వలేదన్న చంధాన ప్రభుత్వం అనుమతిచ్చినా సరే కరోనా రాక్షసి మాత్రం కాటేస్తోంది. ఈమధ్యనే తెలుగు టీవీ నటుడు
ప్రభాకర్‌కు కరోనా సోకిందనే రూమర్స్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి. తాజాగా ఆమెకథ, నా పేరు మీనాక్షి వంటి సీరియల్స్‌లో నటిస్తున్న నవ్యా స్వామికి కూడా కరోనా పాజిటివ్ రావడంతో టీవీ ఇండస్ట్రీలో కల్లోలం మొదలైంది. ఇది జరిగి రెండు రోజులు పూర్తి కాకముందే ఆమెతో కలిసి ఆమె కథలో నటిస్తున్న రవికృష్ణకు కూడా కరోనా వైరస్ సోకిందనే వార్త వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా తెలుగు టీవీ ఇండస్ట్రీ మొత్తం కరోనా భయంతో వణికిపోతోంది. రవికృష్ణ బిగ్‌బాస్3 తో పాపులరైన నటుడన్న సంగతి అందరికీ తెలిసిందే. రవికృష్ణకు నిజంగానే కరోనా పాజిటివ్ వచ్చిందా.? అని కొందరు మీడియా ప్రతినిధులు ఆరా తీయగా..
నేను గత 3 రోజుల నుండి క్వారంటైన్ లోనే వున్నాను. మీ ఆశీర్వాదాలతో, దేవుని దయతో క్షేమంగానే వున్నాను. నాకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవు. ఇది ఎవరి ద్వారా సోకిందో దాని గురించి నేను బాధ పడటం లేదు. మొన్నటివరకూ నాతో టచ్ లో వున్న వాళ్ళందరూ వెంటనే పరీక్షించుకోండి. కరోనా లక్షణాలుంటే క్వారంటైన్ లోకి వెళ్లండి. వైరస్ సోకిన వారిని మరోల వివక్షతతో చూడవద్దని అందర్నీ అభ్యర్థిస్తున్నాను. నన్ను మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా వుండనివ్వండి అంటూ సోషల్ మీడియాలో రవికృష్ణ ఆసక్తికరమైన పోస్ట్‌ని షేర్ చేయడంతో ఇప్పుడు ఈ కరోనా భయం అందరికీ పట్టుకుంది. నిన్న.. మొన్నటి వరకూ రవికృష్ణతో టచ్ లో వున్నవాళ్ళందరూ తలలు పట్టుకు కూర్చున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…