బిగ్ బాస్ హౌస్ లో మొదటి ఎలిమినేషన్ గా సరయు బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ‘7 ఆర్ట్స్’ యూట్యూబ్ ఛానల్ ద్వారా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఆ యూట్యూబ్ ఛానల్ లో ప్రతీ వీడియో హాట్ హాట్ గా ఉంటాయి. బూతులు మాట్లాడుతూ.. ఎక్స్‌పోజింగ్ చేస్తూ రచ్చ చేస్తూ ఉండేది. కానీ ఆమె హౌస్ లోకి వెళ్లిన దగ్గర నుంచి ఎలాంటి బూతులు మాట్లాడకుండా ఉంది కానీ.. హౌస్ మేట్స్ తో మాత్రం కలిసిలేదు.
సరిగా ఇతర కంటెస్టెంట్ లతో దూరంగా ఉండాలనే ఆలోచనతోనే ఉండేది. అదే ఆమెను బయటకు తీసుకువచ్చేట్టు చేసిందా.. అనేది కూడా అనుమానం వ్యక్తం చేశారు ఆమె అభిమానులు. ఇదిలా ఉండగా..నాగార్జున హౌస్ మేట్స్ తో మాట్లాడుతున్న సమయంలో కూడా ఏంటి సరయు బూతులు మాట్లాడటం లేదు.. ఏమైంది అని అడగ్గా.. మీరు తిడతారేమోనని మాట్లాడటం లేదుసార్ అంటూ సమాధానం ఇచ్చింది.
ఇక బటయకు వచ్చిన దగ్గర నుంచి సిరి, షణ్ముఖ్ లు మైండ్ గేమ్ ఆడుతున్నారని విరుచుకుపడంది. బిగ్ బాస్ బజ్ లో అయితే రవి, సిరి, షణ్ముఖ్ ఫొటోలను తన కాలిలో విరగొట్టేసింది. షణ్ముఖ్‌కి దమ్ముంటే మాగాడిలా ఆట ఆడాలని లేదంటే ఆడదానిలా గాజులేసుకుని మూలన కూర్చోవాలని చెప్పింది. అలాగే సిరి హనుమంత్ మగాళ్లను అడ్డుపెట్టుకుని గేమ్ ఆడుతుందంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. అయితే ఆమె బయటకు వచ్చిన తర్వాత షణ్ముఖ్ ఫ్యాన్స్ ఫోన్లు చేసి ఇష్టం వచ్చినట్లు తిట్టడంతో పాటు.. సోషల్ మీడియాలో బ్యాడ్ కామెంట్లు కూడా పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.
హౌస్ లో ఏం జరిగిందో మీకు తెలియదని.. అన్ని ఆధారాలతో తాను సెప్టెంబర్ 15 న యూట్యూబ్ లో వీడియో అప్ లోడ్ చేస్తానని సవాల్ విసిరింది. కానీ ఎలాంటి ఆధారలతో వీడియో చేయలేదు. దానికి గల కారణం తెలియదు. కానీ ఆమె షణ్ముఖ్ ఫ్యాన్స్ కు మరో సవాల్ విసిరింది.. దమ్ముంటే సైదాబాద్ లోని చిన్నారి కుటుంబసభ్యులను ఓదార్చండి అంటూ చెప్పింది. తర్వాత నా గురించి కామెంట్లు పెట్టండంటూ సమాధానం ఇచ్చింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…